World Cup 2023 New Rules: వన్డే ప్రపంచ కప్ 2023లో తొలిసారి కనిపించనున్న 5 ప్రత్యేకతలు.. అవేంటంటే?

|

Oct 02, 2023 | 3:21 PM

ODI World Cup 2023: ప్రపంచ కప్ 2023లో కొన్ని నియమాల్లో మార్పులు చేశారు. దీంతో కొత్త చరిత్రను సృష్టించనుంది. గతంలో ఎన్నడూ జరగని కొన్ని సంఘటనలు ఈ ప్రపంచకప్‌లో చోటుచేసుకోనున్నాయి. ఇలాంటి కొన్ని వాస్తవాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం. కాగా, ప్రపంచ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి భారతదేశంలో మొదలుకానుంది. లీగ్‌లోని మొదటి మ్యాచ్ గత ఛాంపియన్ ఇంగ్లాండ్ వర్సెస్ రన్నరప్ న్యూజిలాండ్ (Engalnd vs New Zealand) మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది.

World Cup 2023 New Rules: వన్డే ప్రపంచ కప్ 2023లో తొలిసారి కనిపించనున్న 5 ప్రత్యేకతలు.. అవేంటంటే?
World Cup 2023
Follow us on

ODI World Cup 2023: కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) త్వరలో ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి భారతదేశంలో మొదలుకానుంది. లీగ్‌లోని మొదటి మ్యాచ్ గత ఛాంపియన్ ఇంగ్లాండ్ వర్సెస్ రన్నరప్ న్యూజిలాండ్ (England vs New Zealand) మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది. అయితే, ఈ ప్రపంచకప్ కొన్ని నిబంధనలను మార్చి కొత్త చరిత్ర సృష్టించనుంది. గతంలో ఎన్నడూ జరగని కొన్ని సంఘటనలు ఈ ప్రపంచకప్‌లో చోటుచేసుకోనున్నాయి. అలాంటి కొన్ని వాస్తవాల గురించి ఇప్పడు తెలుసుకుందాం..

1. మొదటిసారి సోలోగా హోస్టింగ్..

ఈ ప్రపంచకప్‌ భారత్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హోస్టింగ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఒంటరిగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. గతంలో భారత్ 1987, 1996, 2011లో వన్డే ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

2. వెస్టిండీస్ జట్టు లేని తొలి ప్రపంచకప్..

వన్డే ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు శాశ్వత జట్టుగా కొనసాగుతోంది. అయితే, వన్డే ప్రపంచకప్ చరిత్రలో కరీబియన్ జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోవడం ఇదే తొలిసారి. 1975, 1979లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ ఈసారి అర్హత సాధించలేకపోయింది.

3. నిబంధనలలో కొన్ని మార్పులు..

మునుపటి ప్రపంచ కప్‌లో అంటే 2019 ప్రపంచ కప్‌లో బౌండరీ కౌంట్ నియమం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అంటే మ్యాచ్ టై అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించారు. ఈ నిబంధన కారణంగా న్యూజిలాండ్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. నిజానికి గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్‌ ఓవర్‌ ఆడారు. అప్పుడు కూడా మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఏ జట్టు ఎక్కువ బౌండరీలు సాధిస్తే ఆ జట్టును ఛాంపియన్‌గా ప్రకటించేవారు.

తద్వారా చివరి మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లండ్ జట్టును ఛాంపియన్‌గా ప్రకటించారు. ఇది చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ నిబంధనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఐసీసీ ఈ నిబంధనను మార్చింది. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతారు. అది కూడా టై అయితే ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌ని నిరంతరం నిర్వహిస్తారు.

4. సరిహద్దు చుట్టుకొలత 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు..

ఈ ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పలు మైదానాల పిచ్ క్యూరేటర్లకు ‘ప్రోటోకాల్’ జారీ చేసింది. అందుకనుగుణంగా ప్రపంచకప్ వేదికల్లో గ్రాస్ పిచ్ లను సిద్ధం చేయాలని ఆదేశించింది. సరిహద్దు దూరం 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను కూడా జారీ చేసింది. గత ప్రపంచకప్‌లో ఇలాంటి బౌండరీ లైన్‌ నిబంధన లేదు.

5. సాఫ్ట్ సిగ్నల్ లేదు..

ఐసీసీ ఈ ఏడాది జూన్ నుంచి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేసింది. అంటే ఈ సాఫ్ట్ సిగ్నల్ రూల్ ఈ వరల్డ్ కప్ లో కనిపించదు. సాఫ్ట్ సిగ్నల్ నియమం ప్రకారం, ఆన్‌ఫీల్డ్ అంపైర్ బ్యాటర్ అవుట్ అయ్యాడా లేదా నాట్ అవుట్ అయ్యాడో ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, ఆన్‌ఫీల్డ్ అంపైర్లు (ఫీల్డ్‌లో ఉన్నవారు) తమ నిర్ణయం తీసుకోవడానికి థర్డ్ అంపైర్ సహాయం తీసుకోవచ్చు. అయితే దీనికి ముందు, బౌలింగ్ ఎండ్‌లో నిలబడిన అంపైర్ ఇతర అంపైర్‌లతో సంప్రదించిన తర్వాత తన నిర్ణయాన్ని (అవుట్ లేదా నాటౌట్) ఇవ్వాలి.

దీని తర్వాత అతను సాఫ్ట్ సిగ్నల్ నియమం ప్రకారం థర్డ్ అంపైర్‌తో మాట్లాడాలి. ఇందులో థర్డ్ అంపైర్ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని చూస్తుంటారు. ఉదాహరణకు, ఫీల్డర్ ద్వారా క్యాచ్ ప్రశ్నార్థకం అని అనుకుందాం. ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ దీనిపై అప్పీల్ చేస్తారు. అంతకు ముందు ఆన్‌ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని (అవుట్ లేదా నాటౌట్) ప్రకటించాలి. థర్డ్ అంపైర్ క్యాచ్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలిస్తాడు. అయితే, ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీలో థర్డ్ అంపైర్‌కు తగిన ఆధారాలు లభించకపోతే, ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఇచ్చిన నిర్ణయాన్ని బలపరుస్తాడు. అంటే ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ తరహా నిర్ణయం గతంలో ఎన్నో వివాదాలు సృష్టించింది. కాబట్టి ఈసారి ఈ సాఫ్ట్ సిగ్నల్ నిబంధన రద్దు చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..