
Shreyanka Patil In WCPL 2023: గత 10 ఏళ్లుగా భారత జట్టులోని పురుష ఆటగాళ్లతో పాటు, మహిళా క్రికెట్ క్రీడాకారులు కూడా మైదానంలో అద్భుతంగా రాణిస్తున్నారు. పురుషుల జట్టు ఆటగాళ్లు బోర్డు తరపున విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు అనుమతి లేదు. అదే సమయంలో మహిళా ఆటగాళ్లకు బోర్డు మినహాయింపు ఇచ్చింది. తాజాగా 21 ఏళ్ల భారత మహిళా ప్లేయర్ శ్రేయాంక పాటిల్ వెస్టిండీస్‌లో జరగనున్న ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (WCPL 2023)లో ఆడనున్న తొలి ప్లేయర్‌గా అవతరించింది.
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో యువ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ను గయానా అమెజాన్ వారియర్స్ జట్టు ఎంపిక చేసింది. WCPL రాబోయే ఎడిషన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. భారత మహిళల జట్టులోని చాలా మంది క్రీడాకారులు ఇంతకు ముందు కూడా విదేశీ టీ20 లీగ్‌లలో కనిపించారు.
మహిళల జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌లతో సహా అనేక ఇతర క్రీడాకారులు ది హండ్రెడ్ ఇన్ ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా మహిళల బిగ్ బాష్ లీగ్‌లో కనిపించారు.
గత నెలలో హాంకాంగ్ వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో బంతితో శ్రేయాంక అద్భుత ప్రదర్శన కనబర్చింది. శ్రేయాంక 2 మ్యాచ్‌ల్లో 7 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాంక 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో విశేషంగా దోహదపడింది. శ్రేయాంక తన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్‌ను కూడా అందుకుంది.
శ్రేయాంక పాటిల్ మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు తరపున ఆడింది. ఈ సమయంలో ఆమె 7 మ్యాచ్‌లు ఆడుతూ 6 వికెట్లు పడగొట్టింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.