IPL 2024 Points Table: పాయింట్ల పట్టికలో చెన్నై దూకుడు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్టులో టాప్ ఎవరంటే?

Indian Premier League 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024)లో మూడు మ్యాచ్‌లు ముగిశాయి. నేడు రాజస్థాన్-లక్నో, గుజరాత్-ముంబై మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ పాయింట్ల పట్టికలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

IPL 2024 Points Table: పాయింట్ల పట్టికలో చెన్నై దూకుడు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్టులో టాప్ ఎవరంటే?
IPL 2024

Updated on: Mar 24, 2024 | 8:36 AM

Indian Premier League 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నమెంట్ ప్రారంభమై రెండు రోజులు గడిచాయి. ఇప్పటివరకు మొత్తం మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. శనివారం మొదటి డబుల్ హెడర్ నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించగా , తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై KKR గెలిచింది. ఈరోజు కూడా ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు నిర్వంచనున్నారు. IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఓసారి చూద్దాం..

రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చెన్నై ఒక మ్యాచ్ గెలిచింది. రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. రన్ రేట్ +0.779లుగా నిలిచింది.

శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్ నెట్ రన్ రేట్ +0.455‌లుగా నిలిచింది.

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం నెట్ రన్ రేట్ +0.200లుగా నిలిచింది.

పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడి పాయింట్లు సాధించకుండా ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.200లుగా నిలిచింది.

రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఓడి పాయింట్లు సాధించకుండా తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ నెట్ రన్ రేట్ -0.455లుగా నిలిచింది.

ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క మ్యాచ్‌లో ఓడి పాయింట్లు సాధించకుండా చివరి స్థానంలో ఉంది. బెంగళూరు జట్టు నెట్ రన్ రేట్ -0.779లుగా నిలిచింది.

మిగిలిన జట్లు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

పర్పుల్-క్యాప్ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై నాలుగు వికెట్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాత హైదరాబాద్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ టి.నటరాజన్ కేకేఆర్‌పై మూడు వికెట్లు తీశాడు.

అలాగే, KKR బౌలర్ ఆండ్రీ రస్సెల్ కేవలం 25 బంతుల్లో 64 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. 63 పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్‌కి చెందిన హెన్రిచ్ క్లాసెన్ రెండో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..