IPL 2024: ఇదేం షాట్ భయ్యా.. క్రికెట్ హిస్టరీలోనే చూడలేదుగా.. రిటైర్మెంట్ సీజన్‌లో డీకే భీభత్సం..
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ స్పెషల్ షాట్ కొట్టడంతో అతను కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు. మ్యాచ్ 20వ ఓవర్లో తుషార్ దేశ్ పాండే వేసిన బంతిని దినేష్ కార్తీక్ రివర్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ దిగువకు తగిలి నేరుగా లెగ్ సైట్‌లోని బౌండరీ లైన్‌ను దాటింది.