Telugu News Sports News Cricket news 15 Glorious Years of virat kohli On this day in 2008, Team india Virat Kohli made his debut for India and the rest is history
Virat Kohli @15 Years: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సరిగ్గా 15 ఏళ్లైంది. అరంగేట్రం మ్యాచ్‌లో విఫలైమన అతను.. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు. కోహ్లీ విశ్వవిజేతగా నిలిచాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టీమిం ఇండియాకు కెప్టెన్‌గా మారి జట్టుకు గతంలో ఎన్నడూ లేని విజయాలను అందించాడు. 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లి ఈ ఫార్మాట్‌లో 275 మ్యాచ్‌ల్లో 12898 పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Virat Kohli @15 Years: 501 మ్యాచ్‌లు, 25,582 పరుగులు, 76 సెంచరీలు.. గత 15 ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు. ఈ గణాంకాలతో విరాట్ కోహ్లీ అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లెక్కల ఆధారంగా క్రికెట్ ప్రపంచానికి రారాజుగా నిలిచాడు. నేటికి సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అంటే 18 ఆగస్ట్ 2008న తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి దిగాడు. ఎన్నో కలలతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అది జరగలేదు.
శ్రీలంకతో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తన తొలి మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయానన్న బాధ అతనికి కలిగింది. అరంగేంట్రం మ్యాచ్‌లో 33 నిమిషాలు కూడా క్రీజులో నిలబడలేని కుర్రాడు.. రానున్న కాలంలో ఈ గేమ్‌ను శాసిస్తాడని బహుశా ప్రపంచం అప్పట్లో భావించి ఉండకపోవచ్చు. రానున్న 15 ఏళ్లలో ప్రపంచంలోని పెద్ద రికార్డులన్నీ ధ్వంసం కానున్నాయని కూడా ఊహించకపోవచ్చు. ఆ మ్యాచ్ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూడలేదు.
2008లో వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లి ఈ ఫార్మాట్‌లో 275 మ్యాచ్‌ల్లో 12898 పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే అరంగేట్రం తర్వాత 2 సంవత్సరాలలో అంటే 2010 లో అతను T20 లో అరంగేట్రం చేశాడు. 115 టీ20 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 37 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 4008 పరుగులు చేశాడు. మరోవైపు, 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి ఈ ఫార్మాట్‌లో 29 సెంచరీలు, హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 8676 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు. అతను 15 సంవత్సరాల 5475 రోజుల్లో అనేక విజయాలు సాధించాడు. అయితే అతను తన కెరీర్‌లో సాధించిన 15 అత్యంత ప్రత్యేకమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
2008లో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.
2011లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు. భారత్ విజయంలో బ్యాట్‌తో దోహదపడ్డాడు.
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా తరపున అత్యధికంగా 43 పరుగుల స్కోరు నమోదు చేశాడు.
2013లో విరాట్ కోహ్లీ తొలిసారి వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. 2018లో టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా నిలిచిన ఏకైక భారత క్రికెటర్‌గా నిలిచాడు.
2014లో MS ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత, కోహ్లి టెస్ట్ జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత అతను ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు.
ఫ్యాన్స్ ట్వీట్..
The God of Cricket , The king , The Emperor , The Chase Master , The Beast , The Epitome of Dedication and Will power. One n only @imVkohli . We are blessed to have you Virat Kohli.🇮🇳❤️.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 4008 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. 213 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అతను సచిన్ టెండూల్కర్‌ను వెనక్కునెట్టాడు.
2018లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు.
2018-2019లో కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియాలో భారత్ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారతీయుడు, తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.
విరాట్ కోహ్లీ ట్వీట్..
టెస్టు తర్వాత టీ20, వన్డే జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2019లో అతని నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టింది.
2020లో ఐసీసీ అతన్ని దశాబ్దపు అత్యుత్తమ పురుష క్రికెటర్‌గా ఎంపిక చేసింది. అతను దశాబ్దపు ఉత్తమ ODI క్రికెటర్‌గా కూడా ఎంపికయ్యాడు.
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ తర్వాత 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నాల్గవ భారత ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 76 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ తర్వాత కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
జిమ్‌లో కసరత్తులు..
టెస్టు క్రికెట్ చరిత్రలో 7 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా నిలిచాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ కూడా కోహ్లీ. అతని కెప్టెన్సీలో టీమ్ ఇండియా 68 మ్యాచ్‌ల్లో 40 గెలిచింది. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.