MS Dhoni’s CSK: ఐపీఎల్‌లో ధోని సేన ప్రభంజనం.. ఏకంగా 12వ సారి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశం.. సీఎస్‌కే టైమ్‌లైన్ ఎలా ఉందంటే..?

|

May 20, 2023 | 9:44 PM

Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌‌కి తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా రికార్డుల్లో నిలిచిన చెన్నై.. ఆ సంఖ్యను తాజాగా మరింతగా పెంచుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ప్లేఆఫ్స్‌లోకి..

MS Dhonis CSK: ఐపీఎల్‌లో ధోని సేన ప్రభంజనం.. ఏకంగా 12వ సారి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశం.. సీఎస్‌కే టైమ్‌లైన్ ఎలా ఉందంటే..?
Chennai Super Kings
Follow us on

Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌‌కి తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా రికార్డుల్లో నిలిచిన చెన్నై.. ఆ సంఖ్యను తాజాగా మరింతగా పెంచుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన చెన్నై.. 16 సీజన్ల ఐపీఎల్ క్రికెట్‌లో 12వ సారి ఈ ఘనతను సాధించింది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. చెన్నై మధ్యలో రెండు సీజన్ల నుంచి నిషేధానికి గురైంది. అంటే చెన్నై ఆడిన 14 సీజన్లలోనే 12 సార్లు ప్లేఆఫ్స్‌కి చేరింది. మిగిలిన రెండు సీజన్‌లలో చెన్నై లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 4 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. ఇక చెన్నై తర్వాత ముంబై ఇండియన్స్(2008-2022) 9 సార్లు ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. మరో రెండుసార్లు మాత్రమే లీగ్‌ స్టేజ్‌కు పరిమితమైంది.

చెన్నై సూపర్ కింగ్స్: ఐపీఎల్ 2008 నుంచి ఐపీఎల్ 2023 వరకు

  • ఐపీఎల్ 2008: ఐపీఎల్ ఆరంభ సీజన్‌లోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి.. టోర్నీరన్నరప్‌గా నిలిచింది.
  • ఐపీఎల్ 2009: రెండో సీజన్‌లో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన చెన్నై.. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో.
  • ఐపీఎల్ 2010: తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన ధోని సేన మూడో సారి నేరుగా టైటిల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2010 ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ని ఓడించడం ద్వారా చెన్నై టోర్నీ ఛాంపియన్‌గా అవతరించింది.
  • ఐపీఎల్ 2011: డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై నాలుగో సీజన్‌లో కూడా అదరగొట్టి మళ్లీ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బెంగళూరును ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా చెన్నై అవతరించింది.
  • ఐపీఎల్ 2012: అప్పటికే రెండు సార్లు టోర్నీ విజేతగా ఉన్న చెన్నైకి.. హ్యాట్రిక్‌ ఛాంపియన్‌గా నిలుద్దామనే ఆశలకు బ్రేక్‌ పడింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడిపోయింది.
  • ఐపీఎల్ 2013: 2013 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై టీమ్ టోర్నీ రన్నరప్‌గా నిలిచింది. 2010 లో తమ చేతిలో ఓడిపోయిన ముంబై ఈ సారి చెన్నైపై విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది.
  • ఐపీఎల్ 2014: 2014 ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన చెన్నై మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో క్వాలిఫయర్‌లో పంజాబ్‌ టీమ్ చేతిలో ఓడింది.  కానీ అదే ఏడాదిలో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 టోర్నీలో చెన్నై విజేతగా నిలిచింది.
  • ఐపీఎల్ 2015: 2015లో కూడా ఫైనల్‌కి చేరిన చెన్నై టీమ్ మూడో సారి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధిచింది. అయితే అప్పటికే చెన్నై టీమ్ అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది.
  • ఐపీఎల్ 2017, 2018: ఈ రెండు సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ టోర్నీ నుంచి నిషేధానికి గురైంది.
  • ఐపీఎల్ 2018: రెండు సీజన్లలో నిషేధానికి గురైన చెన్నై.. పునరాగమనం చేసిన సీజన్‌లోనే టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి, కప్ సొంతం చేసుకుంది.
  • ఐపీఎల్ 2019: ఈ సీజన్‌లోనూ చెన్నై మళ్లీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ ఫైనల్‌లో చెన్నైని ముంబై ఇండియన్స్ టీమ్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడించి, కప్ కొట్టేసింది. దీంతో చెన్నై టీమ మరోసారి టోర్నీ రన్నరప్‌గానే సర్దుకుంది.
  • ఐపీఎల్ 2020: ఈ లీగ్‌లో చెన్నై టీమ్ లీగ్ దశకే సరిపెట్టుకుంది.
  • ఐపీఎల్ 2021: ముందు సీజన్‌లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైన చెన్నై 2021 సీజన్‌లో నేరుగా ఫైనల్‌కి చేరింది. అలా ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి నాలుగోసారి ధోనీసేన టైటిల్‌ను సొంతం చేసుకుంది.
  • ఐపీఎల్ 2022: నాలుగు సార్లు టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై మరుసటి సీజన్‌లో ఘోరంగా విఫలమైంది.
  • ఐపీఎల్ 2023: 2022 ఐపీఎల్ సీజన్‌లో పేలవంగా ఆడిన చెన్నై టీమ్ తాజా సీజన్‌లో అదరగొట్టింది. ధోనీకి ఇదే చివరి సీజన్‌గా భావిస్తున్న సమయంలో చెన్నై ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..