ఐసీసీ నయా రూల్స్.. బంతిపై ఉమ్మి రుద్దితే 5 రన్స్ ఫైన్..
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కారణంగా తాత్కాలిక నిబంధనలకు ఐసీసీ అమలులోకి తెచ్చింది. బంతిపై ఉమ్మిని రుద్దడాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది.

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కారణంగా తాత్కాలిక నిబంధనలకు ఐసీసీ అమలులోకి తెచ్చింది. బంతిపై ఉమ్మిని రుద్దడాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. కొవిడ్-19 సబ్‌స్టిట్యూట్‌కు పర్మిషన్ ఇచ్చింది. తటస్థ అంపైర్ల బదులు లోకల్ అంపైర్లను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో రివ్యూను ఇచ్చింది. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే లీడ్ లోని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయాలను వెల్లడించింది.
ఇంటర్నేషనల్ క్రికెట్‌ను తిరిగి ఆరంభించేందుకు అన్ని బోర్డులు రెడీ అయ్యాయి. అయితే ఏ ప్లేయర్ లో అయినా కోవిడ్ సింటమ్స్ బయటపడితే సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి ఇవ్వాలని ఇంగ్లాండ్ బోర్డు కోరింది. ఇందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ వేసింది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ లాగనే.. బౌలర్‌కు బౌలర్, బ్యాటర్‌కు బ్యాటర్‌ను మ్యాచ్ రిఫరీ పర్మిషన్ మేరకు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవచ్చు. ఈ రూల్ కేవలం టెస్టులకు మాత్రమే వర్తిస్తుంది. టీ20, వన్డేలకు అవకాశం ఉండదు.
బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు ప్లేయర్స్ ఇకపై ఉమ్మిని ఉపయోగించకూడదు. ఒకవేళ ప్లేయర్ పొరపాటును మర్చిపోయి ఉమ్మి రుద్దితే అంపైర్లు కొంత వెసులుబాటు ఇస్తారు. మళ్లీ రుద్దితే మాత్రం వార్నింగ్ ఇస్తారు. రెండు వార్నింగ్స్ తర్వాతా ఇదే రిపీట్ అయితే 5 రన్స్ జరిమానా విధిస్తారు. ప్రత్యర్థి జట్టు ఖాతాలో వాటిని జమ చేస్తారు.




