AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ నుండి కుల్దీప్, చాహల్‌ ఔట్… ఎందుకంటే?

దక్షిణాఫ్రికాతో ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇటీవల జట్టుని ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. అగ్రశ్రేణి మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌‌లను పక్కన పెట్టారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో.. ఈ స్పిన్ ద్వయానికి ఎక్కువ అవకాశాలివ్వాల్సిందిపోయి ఇలా పక్కన పెట్టడమేంటి..? అని కొంత మంది ప్రశ్నలు లేవనెత్తారు. కుల్దీప్, చాహల్ స్థానంలో టీ20 జట్టులో‌కి దీపక్ చాహర్, కృనాల్‌ పాండ్య‌ ఎంపికైన విషయం […]

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ నుండి కుల్దీప్, చాహల్‌ ఔట్... ఎందుకంటే?
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 10, 2019 | 4:40 PM

Share

దక్షిణాఫ్రికాతో ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇటీవల జట్టుని ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. అగ్రశ్రేణి మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌‌లను పక్కన పెట్టారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో.. ఈ స్పిన్ ద్వయానికి ఎక్కువ అవకాశాలివ్వాల్సిందిపోయి ఇలా పక్కన పెట్టడమేంటి..? అని కొంత మంది ప్రశ్నలు లేవనెత్తారు. కుల్దీప్, చాహల్ స్థానంలో టీ20 జట్టులో‌కి దీపక్ చాహర్, కృనాల్‌ పాండ్య‌ ఎంపికైన విషయం తెలిసిందే.

కుల్దీప్ యాదవ్, చాహల్‌లను పక్కన పెట్టడానికి గల కారణాన్ని తాజాగా టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ‘భారత స్పిన్‌ విభాగంలో వెరైటీ కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే.. టీ20 ప్రపంచకప్‌లోపు యువ క్రికెటర్లకి అవకాశాలివ్వడం ద్వారా.. పరీక్షించనున్నాం. గత రెండేళ్లుగా టీ20, వన్డేల్లో కుల్దీప్, చాహల్ అద్భుతంగా రాణిస్తున్నారు. వారు ఇప్పటికీ రేసులో ముందున్నారు. కానీ.. ప్రస్తుతానికి కొంత మంది స్పిన్నర్ల‌కి అవకాశాలివ్వాలని నిర్ణయించాం’ అని స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికాతో ఆదివారం నుంచి మూడు టీ20ల సిరీస్‌ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత అక్టోబరు 2 నుంచి మూడు టెస్టుల సిరీస్‌లో తలపడుతుంది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో కృనాల్‌ పాండ్య తన స్పిన్ బౌలింగ్‌తో టీ20ల్లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Follow Us
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!