ఫేక్ బర్త్‌ సర్టిఫికేట్.. క్రికెటర్‌పై బీసీసీఐ వేటు

ఫేక్ బర్త్ సర్టిఫికేట్ పెట్టి క్రికెట్ టోర్నీల్లో ఆడినందుకు క్రికెటర్‌పై బీసీసీఐ వేటు వేసింది. తప్పు చేసినందుకు అతడిని రెండేళ్ల పాటు దేశవాళీ సీజన్లలో క్రికెట్ ఆడకూడదంటూ ఆదేశించింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ సంఘంకు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడే ప్రిన్స్ రామ్ నివాస్ 1996లో జన్మించాడు. సీబీఎస్‌ఈ ప్రకారం అతడి పుట్టిన తేది జూన్ 10, 1996. కానీ తాను డిసెంబర్ 12, 2001లో పుట్టినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘంకు […]

ఫేక్ బర్త్‌ సర్టిఫికేట్.. క్రికెటర్‌పై బీసీసీఐ వేటు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 02, 2019 | 9:37 PM

ఫేక్ బర్త్ సర్టిఫికేట్ పెట్టి క్రికెట్ టోర్నీల్లో ఆడినందుకు క్రికెటర్‌పై బీసీసీఐ వేటు వేసింది. తప్పు చేసినందుకు అతడిని రెండేళ్ల పాటు దేశవాళీ సీజన్లలో క్రికెట్ ఆడకూడదంటూ ఆదేశించింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ సంఘంకు తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడే ప్రిన్స్ రామ్ నివాస్ 1996లో జన్మించాడు. సీబీఎస్‌ఈ ప్రకారం అతడి పుట్టిన తేది జూన్ 10, 1996. కానీ తాను డిసెంబర్ 12, 2001లో పుట్టినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘంకు బర్త్‌ సర్టిఫికేట్‌ను సమర్పించిన ప్రిన్స్.. 2018-19, 2019-20 సీజన్లకు అండర్-19 విభాగంలో పేరును నమోదు చేయించుకున్నాడు. అయితే అతడి వయసుపై ఫిర్యాదు రావడంతో వెంటనే దర్యాప్తు చేసిన బీసీసీఐ.. ప్రిన్స్ సమర్పించిన బర్త్ సర్టిఫికేట్ ఫేక్ అని తేల్చేసింది. 1996లో జన్మించిన అతడు, 2012లో పదోతరగతి పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. దీనిపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. రెండేళ్ల పాటు అతడిపై నిషేధం విధించామని.. ఆ తరువాత ప్రిన్స్‌ను పురుషుల సీనియర్ క్రికెట్ టోర్నీల్లోనే అనుమతినిస్తామని పేర్కొంది.