బంగ్లాదేశ్ టీమ్‌కి జరిమానా!

|

Jul 27, 2019 | 9:51 PM

శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో 91 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌ టీమ్‌కి మరో షాక్ తగిలింది.  ‘స్లో ఓవర్ రేట్’ తప్పిదం కింద ఆ జట్టుకి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం, జట్టులోని ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత పడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. కుశాల్ […]

బంగ్లాదేశ్ టీమ్‌కి జరిమానా!
Follow us on

శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో 91 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌ టీమ్‌కి మరో షాక్ తగిలింది.  ‘స్లో ఓవర్ రేట్’ తప్పిదం కింద ఆ జట్టుకి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం, జట్టులోని ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత పడింది.

కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. కుశాల్ పెరీరా (111: 99 బంతుల్లో 17×4, 1×6) శతకం బాదడంతో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఛేదనలో ముష్ఫికర్ రహీమ్ (67: 86 బంతుల్లో 5×4), షబ్బీర్ రెహ్మాన్ (60: 56 బంతుల్లో 7×4) అర్ధశతకాలు బాదడంతో గెలిచేలా కనిపించిన బంగ్లాదేశ్.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకుని ఆఖరికి 41.1 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది.