Asian Games 2023: షూటింగ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం కైవసం

|

Sep 25, 2023 | 8:57 AM

రెండో రోజు షూటింగ్, రోయింగ్, జూడో, స్విమ్మింగ్‌లలో భారత జట్టు పతకాలు సాధించే అవకాశం ఉంది. అయితే షూటింగ్ విభాగంలో భారత్ కు మొదటి స్వర్ణని అందించింది రుద్రాంక్ష్ పాటిల్ టీమ్..  మరోవైపు స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో శ్రీలంకతో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ ఆడనుంది. ఐసీసీ నిషేధం కారణంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయనుంది. ఈ మ్యాచ్‌లో స్వర్ణ పతకానికి టీమ్ ఇండియా గట్టి పోటీదారుగా ఉంది.. ఓడినా రజత పతకం ఖాయం. ఈ పతకం చారిత్రాత్మకం ఎందుకంటే భారతదేశం మొదటిసారి ఆసియా క్రీడలోని క్రికెట్‌ విభాగంలో  పాల్గొంది.

Asian Games 2023: షూటింగ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం కైవసం
Asian Games Gold Medol
Image Credit source: PTI
Follow us on

భారత్‌కు నేడు గొప్ప రోజు. ఆసియా క్రీడలు-2022లో షూటింగ్ పోటీల రెండో రోజైన సోమవారం భారత పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ రుద్రంక్ష్ పాటిల్, ఒలింపియన్ దివ్యాన్ష్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌ల జట్టు క్వాలిఫికేషన్ రౌండ్‌లో 1893.7 పాయింట్స్ సాధించారు. అంతేకాదు ఈ స్కోర్ తో ఇప్పటి వరకూ ఉన్న వరల్డ్ రికార్డ్ ను బీట్ చేశారు. నెల రోజుల కిందట చైనీయులు అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నెలకొల్పిన 1893.3 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.

మరోవైపు మొదటి రోజే భారత క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారు. మొదటి రోజు భారత్ అద్భుత ప్రదర్శన చేసి షూటింగ్ , రోయింగ్‌లో పతకాలు సాధించినట్లు ఆసియా క్రీడల అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది. షూటింగ్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజత పతకం సాధించింది. రోయింగ్‌లో కూడా, పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ , పురుషుల 8 ఈవెంట్‌లలో భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. రోయింగ్‌లో, పురుషుల జోడీలో భారత్‌కు చెందిన బాబు యాదవ్, లేఖ రామ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. షూటింగ్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రమిత కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అంతేకాదు భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఫైనల్ లోకి అడుగు పెట్టి రజత పతకాన్ని ఖాయం చేసుకుంది.

రెండో రోజు జరగనున్న ఈ గేమ్స్ లో భారత్ పతకాలు సాధించడం పై ఆశలు

రెండో రోజు స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో శ్రీలంకతో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ ఆడనుంది. ఐసీసీ నిషేధం కారణంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయనుంది. ఈ మ్యాచ్‌లో స్వర్ణ పతకానికి టీమ్ ఇండియా గట్టి పోటీదారుగా ఉంది.. ఓడినా రజత పతకం ఖాయం. ఈ పతకం చారిత్రాత్మకం ఎందుకంటే భారతదేశం మొదటిసారి ఆసియా క్రీడలోని క్రికెట్‌ విభాగంలో  పాల్గొంది. కనుక మన ఉమెన్స్ క్రికెట్ కు ఇది మొదట పతకం కానుంది. దీంతో పాటు రెండో రోజు షూటింగ్, రోయింగ్, జూడో, స్విమ్మింగ్‌లలో భారత జట్టు పతకాలు సాధించే అవకాశం ఉంది. అయితే షూటింగ్ విభాగంలో భారత్ కు మొదటి స్వర్ణని అందించింది రుద్రాంక్ష్ పాటిల్ టీమ్..

ఇవి కూడా చదవండి

సోమవారం ఆసియా గేమ్స్‌లో భారత్ షెడ్యూల్ ..

భారతదేశ షెడ్యూల్ 25 సెప్టెంబర్ 2023 రోయింగ్ ఫైనల్:
పురుషుల సింగిల్ స్కల్స్, పురుషుల నాలుగు, పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్, పురుషుల 8, బాల్ రాజ్ పవార్ – ఉదయం 6:30 (పతక ఈవెంట్)

స్విమ్మింగ్
పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్, శ్రీహరి నటరాజ్ – ఉదయం 7:30 గంటలకు మహిళల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్, మనా పటేల్ – ఉదయం 7:30 గంటలకు పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్, అనిల్ కుమార్ ఆనంద్, వీర్ధావల్ ఖాడే – ఉదయం 7:30 గంటలకు మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్, ధన్‌ఇద్హిట్ దేశింగు – ఉదయం 7:30 గంటలకు మహిళల 200మీ ఫ్రీస్టైల్ ఐఎం హీట్, హసిక రామచంద్ర – ఉదయం 7:30 గంటలకు పురుషుల 4*200మీ రిలే హీట్ – ఉదయం 7:30

షూటింగ్:
రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంష్ సింగ్ పన్వార్ – పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్, వ్యక్తిగత ఫైనల్ మరియు టీమ్ ఫైనల్ – ఉదయం 6:30 (మెడల్ ఈవెంట్)

అనీష్, విజయ్‌వీర్ సిద్ధు, ఆదర్శ్ సింగ్ – పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫికేషన్ ఫేజ్ 2 మరియు వ్యక్తిగత ఫైనల్ – ఉదయం 6:30 (మెడల్ ఈవెంట్)

జిమ్నాస్టిక్స్:
ప్రణతి నాయక్- ఉమెన్స్ క్వాలిఫికేషన్ సబ్ డివిజన్ 1- ఉదయం 7:30

రగ్బీ:
మహిళలు – భారతదేశం మరియు సింగపూర్ – ఉదయం 8:20

(అర్హత సాధిస్తే) మహిళల సెమీ-ఫైనల్ – 1:55 pm

జూడో:
మహిళల 70 కేజీలు, రౌండ్-16, గరిమా చౌదరి, ఉదయం 8:20 (మెడల్ ఈవెంట్)

బాస్కెట్‌బాల్ 3*3:

భారత్ vs ఉజ్బెకిస్థాన్ – మహిళల రౌండ్ రాబిన్ – ఉదయం 11:20

భారతదేశం vs మలేషియా – పురుషుల రౌండ్ రాబిన్ – మధ్యాహ్నం 12:10

హ్యాండ్‌బాల్:
మహిళలు – భారతదేశం vs జపాన్ – 11:30 am

టెన్నిస్:
పురుషుల డబుల్స్ రౌండ్-2, భారత్ vs ఉజ్బెకిస్థాన్ (రోహన్ బోపన్న.. యుకీ భాంబ్రీ) మధ్యాహ్నం 12

చదరంగం:
పురుషుల వ్యక్తిగత రౌండ్ 3 , 4 (విదిత్ గుజరాతీ , అర్జున్ ఎరిగైసి) – మధ్యాహ్నం 12:30

మహిళల వ్యక్తిగత రౌండ్ 3, 4 (కోనేరు హంపీ , హారిక ద్రోణవల్లి) – మధ్యాహ్నం 12:30

వృషు:
నౌరెమ్ రోషిబినా దేవి – మహిళల 60 కేజీల క్వార్టర్ ఫైనల్ – 5:00 PM సూర్య భాను సింగ్ – పురుషుల 60 కేజీల ప్రిలిమినరీ రౌండ్ – 5:00 PM విక్రాంత్ బలియన్ – పురుషుల 60 కేజీల ప్రిలిమినరీ రౌండ్ ఫైనల్ – సాయంత్రం 5:00

బాక్సింగ్:
అరుంధతీ చౌదరి vs లియు యాంగ్ (చైనా) – మహిళల 66 కిలోల రౌండ్ 16 – 4:45 PM

దీపక్ భోరియా vs అబ్దుల్ ఖయ్యూమ్ బిన్ అరిఫిన్ (మలేషియా) – పురుషుల 50 కేజీల రౌండ్ 32 – 5:15 PM

నిశాంత్ దేవ్ vs దీపేష్ లామా (నేపాల్) – పురుషుల 71 కేజీల రౌండ్ 32 – 7:00 PM

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..