గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో పదేళ్ల చిన్నారి రికార్డు సృష్టించాడు. ఆతిథ్య రాష్ట్రానికి చెందిన శౌర్యజిత్ ఖైరే పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతే కాకుండా మల్లాఖాంబ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పిన్న వయస్కుడిగా నిలిచాడు. పతకాల పట్టికలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా.. హర్యానా రెండో ప్లేస్ లో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ ఈవెంట్‌లో మహారాష్ట్ర సోమవారం నాడు మూడు బంగారు పతకాలు సాధించింది. వీటితో కలిపి మహారాష్ట్ర ఖాతాలో 34 స్వర్ణాలు చేరాయి. 26 రజతాలు, 56 కాంస్య పతకాలు సాధించి అత్యధికంగా 126 పతకాలను సాధించింది. ఆర్మీ 53 స్వర్ణాలు సాధించి బంగారు పతకాలు సాధించిన జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. అంతే కాకుండా హర్యానా కూడా 100 పతకాలు సాధించింది.
పదేళ్ వయయులో పతకం సాధించిన శౌర్య జిత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. తన తన విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడని కొనియాడారు. గుజరాత్‌కు చెందిన పూజా పటేల్, కోమల్ మక్వానాతో పోటీ పడి యోగాసనలో రెండో బంగారు పతకం సాధించింది. గుజరాత్ ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 12 రజతాలు, 18 కాంస్య పతకాలతో 43 పతకాలు సాధించింది. మహారాష్ట్రకు చెందిన రూపాలి అద్భుత ప్రదర్శన చేసి మూడో బంగారు పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల రోప్ పోటీలో (9.25) విజయం సాధించింది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సిద్ధి గుప్తా 9.10 స్కోర్‌తో స్వర్ణం సాధించగా.. పురుషుల ఆల్ రౌండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అక్షయ్ ప్రకాష్ తరల్ గెలుచుకున్నాడు.
10-year-old Shauryajit Khaire from Gujarat wins Bronze Medal ? in Mallakhamb(Individual Pole); Becomes the youngest Medalist at the #36thNationalGames
#Mallakhamb #NationalGames2022 #Shauryajit @Media_SAI @ianuragthakur pic.twitter.com/Oa1OUHeRAj
— All India Radio News (@airnewsalerts) October 10, 2022
What a star Shauryajit is. https://t.co/8WoNldijfI
— Narendra Modi (@narendramodi) October 8, 2022
పురుషుల హాకీ సెమీస్‌లో మహారాష్ట్రను ఓడించి ఉత్తరప్రదేశ్‌కు భారీ షాకిచ్చింది. మ్యాచ్ 3-3 తో టై అయిన తర్వాత పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఫైనల్లో కర్ణాటకతో ఉత్తరప్రదేశ్ తలపడనుంది. రెండో సెమీఫైనల్‌లో కర్ణాటక 3-1తో హర్యానాను ఓడించింది. బాక్సింగ్‌లో, డిఫెండింగ్ జాతీయ ఛాంపియన్ సుమిత్ కుందు, మాజీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత జమున బోరో, ఆసియా ఛాంపియన్ సంజీత్ సెమీ-ఫైనల్‌లో పతకాలను ఖాయం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సేనకు చెందిన సుమిత్ హర్యానాకు చెందిన అంకిత్ ఖతానాను ఓడించాడు.