Tata AIG: థార్డ్‌ పార్టీ కార్‌ ఇన్సూరెన్స్ అంటే ఏంటీ.? టాటా ఏఐజీతో కలిగే లాభాలు ఏంటంటే..

| Edited By: Janardhan Veluru

Nov 30, 2023 | 2:12 PM

వీటిలో థార్డ్‌ పార్టీ లయబిలిటీ, ఓన్లీ కవర్‌, ఓన్‌ డ్యామేజ్‌ కవర్‌, కాంప్రన్సివ్‌ కవర్‌ వంటి ఇన్సూరెన్సులు ఉన్నాయి. అయితే థార్డీ పార్టీ ఇన్సూరెన్స్‌ కచ్చితంగా కలిగి ఉండాలని అధికారులు చెబుతుంటారు. చట్టప్రకారం వాహనదారులు థర్డ్‌ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సమగ్రమైన బీమా పథకంతో పోలిస్తే ఇది బేసిక్‌ కవరేజీ ఇస్తుంది. దేశంలో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన టాటా ఏఐజీ అందిస్తున్న థార్డ్‌ పార్టీ కార్‌ ఇన్సూరెన్స్‌కు...

Tata AIG: థార్డ్‌ పార్టీ కార్‌ ఇన్సూరెన్స్ అంటే ఏంటీ.? టాటా ఏఐజీతో కలిగే లాభాలు ఏంటంటే..
TATA AIG
Follow us on

కారు ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసకుంటారో అదే విధంగా కారు ఇన్సూరెన్స్‌ విషయంలోనూ జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతుంటారు. కారు ఉన్న ప్రతీ ఒక్కరూ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని చట్టం చెబుతోంది. భారత దేశంలో పలు రకాల కారు ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో థార్డ్‌ పార్టీ లయబిలిటీ, ఓన్లీ కవర్‌, ఓన్‌ డ్యామేజ్‌ కవర్‌, కాంప్రన్సివ్‌ కవర్‌ వంటి ఇన్సూరెన్సులు ఉన్నాయి. అయితే థార్డీ పార్టీ ఇన్సూరెన్స్‌ కచ్చితంగా కలిగి ఉండాలని అధికారులు చెబుతుంటారు. చట్టప్రకారం వాహనదారులు థర్డ్‌ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సమగ్రమైన బీమా పథకంతో పోలిస్తే ఇది బేసిక్‌ కవరేజీ ఇస్తుంది. దేశంలో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన టాటా ఏఐజీ అందిస్తున్న థార్డ్‌ పార్టీ కార్‌ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు థార్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటీ.?

ప్రమాద సమయంలో.. థర్డ్‌ పార్టీ ప్రాపర్టీకి వాటిల్లిన నష్టానికి పరిహారం చెల్లించేందుకు రూపొందించే థార్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌. ప్రమాదంలో థార్డ్ పార్టీకి నష్టం జరిగితే ఈ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం అందుతుంది. థార్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ ధరలు.. కార్ల ఇంజన్‌ కెపాసిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. ఎక్కువ క్యూబిక్‌ కెసాసిటీ ఎక్కువ ప్రీమియంను కలిగి ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం మాత్రమే కాకుండా ఆర్థికపరమైన నష్టం కూడా సంభవిస్తుంటాయి. థార్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ ఇలాంటి నష్టాలను భర్తీ చేస్తాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ కింద పరిహారం ఎంత చెల్లించాలన్నది చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు నిర్దేశిస్తుంటాయి

టాటా ఏఐజీ థార్డ్‌ పార్టీ లయాబిలిటీ ఇన్సూరెన్స్‌..

భారత దేశంలో ప్రసిద్ధి చెందిన థార్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌లో టాటా ఏఐజీ థార్డ్‌ పార్టీ లయాబిలిటీ ఇన్సూరెన్స్‌ ఒకటి. ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఎంతో నమ్మకం కలిగిన ఇన్సూరెన్స్‌గా టాటా ఏఐజీకి పేరుంది. పాలసీదారుడికి కేవలం ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత సైతం ఈ ఇన్సూరెన్స్‌ అందిస్తుంది. థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది వాహన యజమానులకు చట్టపరమైన అవసరం. టాటా AIG ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది, చట్టపరమైన జరిమానాలను నివారించడంలో, సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడంలో పాలసీదారులకు ఇది దోహద పడుతుంది.

టాటా ఏఐజీ థార్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా పాలసీదారుడికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో థార్డ్‌ పార్టీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని చేస్తుంది. ఒకవేళ గాయాలపాలైతే మెడికల్‌ ఖర్చులతో పాటు, కోలుకోవడానికి అయ్యే ఖర్చులు సైతం ఇన్సూరెన్స్‌లో కవర్‌ అవుతాయి. ఇది పాలసీదారుడికి ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుంది. ఇక టాటా ఏఐజీ థార్డ్‌ పార్ట ఇన్సూరెన్స్‌లో కస్టమైజ్‌డ్‌ కవరేజ్‌ ఆప్షన్స్‌ను అందించింది. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన, తమ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవచ్చు. మొదటి సారి కొనుగోలు చేసిన వారికి ఒకలా, అంతకు ముందు కారు ఉన్న వారి మరో విధంగా ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

క్లెయిమ్‌ ఎలా పొందాలి..?

ఇన్సరెన్స్ క్లెయిమ్‌ చేసుకోవడం క్లిష్టమైన ప్రక్రియతో కూడుకున్న విషయమని తెలిసిందే. అయితే టాటా ఏఐజీ ఈ విధానాన్ని సులభతరం చేసింది. పాలసీదారుల కోసం 24/7 కస్టమర్‌ సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలసీకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే ఎప్పుడైనా ఫోన్‌ చేసిన నివృత్తి చేసుకోవచ్చు. ఇక టాటా ఏఐజీలో పారదర్శకతో కూడిన విధానాన్ని అందిస్తోంది. ఎలాంటి హిడెన్‌ ఛార్జెస్‌ ఇందులో లేవు.

కవరేజీలో వర్తించేవి..

* పాలసీ తీసుకున్న వ్యక్తి వాహనం ద్వారా థార్ట్‌ పార్టీకి జరిగిన నష్టం పాలసీలో కవరేజ్‌ అవుతుంది. వాహనం రిపేర్‌, వాహనాల రీప్లేస్‌మెంట్‌ ఖర్చు, ప్రమాదంలో జరిగిన ప్రాపర్టీ డ్యామేజ్‌ కవర్‌ అవుతాయి.

* ప్రమాద సమయంలో తలెత్తే న్యాయపరమైన అంశాలకు అయ్యే ఖర్చును కూడా టాటా ఏఐజీ థార్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ అందిస్తుంది.

* ప్రమాదం సంభవించినప్పుడు అయ్యే మెడికల్‌ ఖర్చులను సైతం టాటా ఏఐజీలో కవర్‌ అవుతాయి. థార్డ్‌ పార్టీలకు అయ్యే మెడికల్‌ ఖర్చులు ఇందులోనే కవర్‌ అవుతాయి.

కవరేజీలో వర్చించని అంశాలు..

* ఉద్దేశపూర్వకంగా జరిగే నష్టాలకు ఇన్సూరెన్స్‌ వర్చించదు.

* డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి లేదా మద్యం సేవించి వాహనం నడిపేవారి వల్ల జరిగే ప్రమాద నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తించదు.

* సహజంగా, ప్రకృతి విపత్తుల కారణంగా జరిగే నష్టానికి (నాన్‌ యాక్సిడెంట్ ఈవెంట్స్‌) ఇన్సూరెన్స్ వర్తించదు.

ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్‌ పొందొచ్చా..

టాటా ఏఐజీ థార్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో తీసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఎలాంటి స్టెప్స్‌ ఫాలో కావాలంటే..

* ముందుగా టాటా ఏఐజీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, కార్‌ ఇన్సూరెన్స్‌ పేజీలోకి వెళ్లాలి.

* అనంరతం కారు రిజిస్ట్రిషేషన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి. గెట్ ప్రైస్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఒకవేళ అప్పటికే ఇన్సూరెన్స్‌ ఉంటే రెన్యువల్‌ చేసుకోవడానికి ‘రెన్యూ’పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే మీ కారుకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి.

* అవసరమైన వివరాలను ఎంటర్‌ చేయాలి. తర్వాతన మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ కావాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.

* వెంటనే స్క్రీన్‌పై మీ ప్రీమియం ఎంతో డిస్‌ప్లే అవుతుంది. దానిని ఆన్‌లైన్‌లో చెల్లిస్తే సరిపోతుంది.

టాటా ఏఐజీకి చెందిన ఏజెంట్‌ మీకు కాల్‌ చేసిన ఇతర వివరాలను తెలియజేస్తారు. అనంతరం మీకు పాలసీ సర్టిఫికేట్‌కు సంబంధించిన ఒక ఈమెయిల్ వస్తుంది. లేదంటే సెల్ఫ్‌ సర్వీస్‌లోవెళ్లి డౌన్‌లోడ్‌ పాలసీపై క్లిక్‌ చేసినా సర్టిఫికేట్ పొందొచ్చు.

థార్ట్‌ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ కచ్చితంగా తీసుకోవాలి. ఒక బాధ్యతగల డ్రైవర్‌గా ఈ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం అవసరం. మీ భద్రతకే కాకుండా, మీతో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇతరుల భద్రత విషయంలో కూడా ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి. థార్డ్‌ పార్టీ లయబిలిటీ పాలసీలు వల్ల మీ వాహనాల రిపేర్‌తో పాటు థార్డ్‌ పార్టీ డ్యామేజీలకు అయ్యే ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకోవచ్చు. కాబట్టి టాటా ఏఐజీలో ఇన్సూరెన్స్ తీసుకోవడం తెలివైన పెట్టుబడిగా భావించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..