Savings: సంపాదనతో పాటు పొదుపు ఎంతో ముఖ్యం.. డబ్బను ఎలా సేవ్ చేసుకోవచ్చు..

ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఎంతో అవసరం. ఓ విధంగా చెప్పాలంటే డబ్బు లేనిదే మన అవసరాలను తీర్చుకోలేం. చాలా మంది డబ్బులు సంపాదిస్తుంటారు. కాని వాటిని పొదుపు చేసుకోవడంలో విఫలమై.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. డబ్బు..

Savings: సంపాదనతో పాటు పొదుపు ఎంతో ముఖ్యం.. డబ్బను ఎలా సేవ్ చేసుకోవచ్చు..
Savings
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 17, 2022 | 10:16 PM

ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఎంతో అవసరం. ఓ విధంగా చెప్పాలంటే డబ్బు లేనిదే మన అవసరాలను తీర్చుకోలేం. చాలా మంది డబ్బులు సంపాదిస్తుంటారు. కాని వాటిని పొదుపు చేసుకోవడంలో విఫలమై.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, సరైన ఆర్థిక ప్రణాళికను కలిగి ఉండటం అంతే ముఖ్యం. వివిధ ఆర్థిక కార్యకలాపాల సహాయంతో పెట్టుబడులను నిర్వహించే సాంకేతికతను వ్యక్తిగత ఫైనాన్స్ అంటారు. సరళంగా చెప్పాలంటే, ఇది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది. డబ్బును సంపాదించడంతో పాటు పొదుపు చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ముఖ్యంగా అత్యవసర నిధిని సృష్టించడం చాలా అవసరం డబ్బు చాలా సమస్యలను పరిష్కరించగలదు. అటువంటి పరిస్థితిలో, అత్యవసర నిధిని సృష్టించడం ఎంతో అవసరం. అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవాలంటే బ్యాంకులో ఖాతా తెరిచి, ప్రతి నెలా చిన్న మొత్తాన్ని అందులో జమ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ డబ్బును ఉపయోగించాలి. చాలా మంది కారు లోన్, హోమ్ లోన్ లేదా ఇతర అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు. దీంతో ఎక్కువ కాలం వడ్డీ రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. మీకు కావాలంటే, ఆటోమేటిక్ డెట్ రీపేమెంట్ ప్లాన్‌ని అనుసరించడం ద్వారా మీరు ప్రతి నెలా ఎక్కువ చెల్లించవచ్చు. అంతే కాకుండా, ప్రతి సంవత్సరం రుణంలో కొంత భాగాన్ని కూడా ముందుగా చెల్లించవచ్చు. రుణాన్ని ముందుగా చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్ మెరుగుపడటమే కాకుండా వడ్డీ డబ్బు కూడా ఆదా అవుతుంది.

పదవీ విరమణ కోసం పొదుపు

పొదుపు అనేది వృద్ధాప్యం తరువాత అవసరాలను తీరుస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత సంపాదించడం కష్టం అందుకే వృద్దాప్యానికి ముందు సంపాదించిన మొత్తాన్ని పొదుపు చేసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో ఎంతో ఉపయోగపడుతుంది. అందుకోసం పదవీ విరమణ ప్రణాళిక అవసరం. మీరు ఉద్యోగంలో ఉండి, పిఎఫ్ ఖాతా కలిగి ఉంటే, మీరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా సహకారాన్ని పెంచుకోవచ్చు. మీకు పిఎఫ్ ఖాతా లేకుంటే, రికరింగ్ డిపాజిట్లు, పిపిఎఫ్, ఇఎల్ ఎస్ ఎస్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అనేక ఆప్షన్ల ఉన్నాయి, వీటిలో మీరు ప్రతి నెలా జీతంలో కొంత భాగాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ఒక నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి

షేర్లు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. స్టాక్ మార్కెట్‌లో, మీరు బ్యాంక్ ఎఫ్‌డిలు, ఆర్‌డిల కంటే ఎక్కువ రాబడిని పొందుతారు. అయితే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు, మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకుని, దాని గురించి పూర్తి వివరాలు శోధించడం ఎంతో ముఖ్యం.

బీమా పాలసీలో పెట్టుబడి

ఏదైనా అవాంఛనీయ సంఘటనల నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి బీమా పాలసీని కొనుగోలు చేయడం చాలా అవసరం. తక్కువ చిన్నవయసులోనే పాలసీని చేయడం ద్వారా చెల్లించే ప్రీమియం తక్కువ ఉంటుంది. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య చికిత్సల ఖర్చు మనకు భారం కాకుడదంటే ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్య్సూరెన్స్) తీసుకోవాలి.

సేవింగ్స్ కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో