Gold Loans: బంగారంపై తీసుకున్న రుణాలు క్రెడిట్ స్కోర్ ను ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఆర్థిక అవసరాల కోసం సాధారణంగా వ్యక్తులు రుణాలు తీసుకుంటుంటారు. ఈ రుణాల్లోనూ చాలా రకాలున్నాయి. వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్), వాహన రుణాలు (వెహికల్ లోన్స్), గృహ రుణాలు (హోమ్ లోన్స్ ) ఇలా అనేక రకాలున్నాయి. రుణం అనేది ఒక రకమైన ఆర్థిక..

Gold Loans: బంగారంపై తీసుకున్న రుణాలు క్రెడిట్ స్కోర్ ను ఎలా ప్రభావితం చేస్తాయి..?
Credit Score
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 17, 2022 | 10:17 PM

ఆర్థిక అవసరాల కోసం సాధారణంగా వ్యక్తులు రుణాలు తీసుకుంటుంటారు. ఈ రుణాల్లోనూ చాలా రకాలున్నాయి. వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్), వాహన రుణాలు (వెహికల్ లోన్స్), గృహ రుణాలు (హోమ్ లోన్స్ ) ఇలా అనేక రకాలున్నాయి. రుణం అనేది ఒక రకమైన ఆర్థిక సహాయం వంటిది. వేరే వ్యక్తి లేదా సంస్థ నుండి రుణాలు తీసుకుంటారు. దీనినే లోన్ లేదా అప్పు అని కూడా అంటారు. రుణాల విషయానికొస్తే ఒక వ్యక్తి తీసుకున్న మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తారనే హామీ ఆధారంగా మంజూరు చేస్తారు. సకాలంలో రుణం చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌ను బాగుంటుంది. దీంతో రుణం లభించడం భవిష్యత్తులో మరింత సులభం అవుతుంది. ఒక వ్యక్తి రుణాన్ని ఎంత బాధ్యతాయుతంగా చెల్లించారనేది క్రెడిట్ స్కోర్ తెలియజేస్తుంది. అయితే బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే గోల్డ్ లోన్ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుందా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే కచ్చితంగా గోల్డ్ లోన్ కూడా క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది. గోల్డ్ లోన్ వాయిదాలు సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా కూడా క్రెడిట్ స్కోర్‌ మెరుగుపడుతుంది. అయితే డిఫాల్ట్ చేయడం వల్ల అంటే సరిగ్గా కట్టకపోతే క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గుతుంది. గోల్డ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంక్ లేదా రుణం ఇచ్చే సంస్థలు సంబంధిత వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ రిపోర్టును క్రెడిట్ బ్యూరోల స్వీకరిస్తుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం గతంలో తీసుకున్న బంగారు రుణాల వాయిదాలు క్రమ పద్దతిలో కట్టి ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.

ఓ వ్యక్తి తన రుణం సరిగ్గా కట్టనట్లు అయితే మాత్రం, క్రెడిట్ స్కోర్ బాగోకపోతే రుణం లభించడం కష్టం అవుతుంది. అలాగే క్రెడిట్ రిపోర్టులో సదరు వ్యక్తికి రుణాల అవసరం ఎక్కువగా ఉందని లేదా అవసరమైన దానికంటే ఎక్కువ రుణాలు తీసుకున్నట్లు తేలిస్తే ఇవి క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి.

బంగారు రుణం పొందిన తర్వాత, మీరు నిర్ణీత నిబంధనల ప్రకారం డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లించి, క్లియర్ చేసుకుంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. మంచి క్రెడిట్ స్కోర్‌ కోసం, లోన్ వాయిదాలను సకాలంలో లేదా ముందుగానే చెల్లించడం ముఖ్యం. వాయిదాలను సకాలంలో చెల్లించడం అనేది వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు సులభంగా రుణాలను అందిస్తాయి. కొన్ని సంస్థలు వడ్డీ రేట్లలో కొంత తగ్గింపును కూడా అందిస్తాయి. రుణాన్ని తిరిగి చెల్లించడంలో అలసత్వం వహిస్తే అది క్రెడిట్ స్కోర్‌ను పాడుచేయడమే కాకుండా, అపరాధ రుసుమును చెల్లించేందుకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

బంగారు రుణాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం చూడండి..

మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్