News9 Plus world exclusive: 1993 ముంబై పేలుళ్ల ప్లాన్ ఐఎస్ఐది.. అమలు చేసింది డీ కంపెనీ: ప్రేమ్ మహదేవన్

|

Mar 12, 2023 | 11:37 AM

The Jehadi General: మార్చి 12, 1993న భారత గడ్డపై జరిపిన ఈ దాడిలో ఒక విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోపాటు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, స్థానిక మాఫియా గ్రూపు సభ్యులు ఈ ఘాతుకంలో పాలుపంచుకున్నారు. ఆ సమయంలో ISIకి లెఫ్టినెంట్ జనరల్ జావిద్ నాసిర్ నేతృత్వం వహించారు.

News9 Plus world exclusive: 1993 ముంబై పేలుళ్ల ప్లాన్ ఐఎస్ఐది.. అమలు చేసింది డీ కంపెనీ: ప్రేమ్ మహదేవన్
Prem Mahadevan
Image Credit source: News9 Plus
Follow us on

The Jehadi General: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల (Mumbai Bomb Blasts) ఘటన ఇప్పటికీ ఉలిక్కిపడేలా చేస్తుంటుంది. భారత్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. ఈ ఘటన 1993 మార్చి 12న జరిగింది. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మందికిపైగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. అసలు 1993 ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన సూత్రధారి ఎవరు? అనే సారాంశంతో వరల్డ్ ఎక్స్‌క్లూజివ్‌లో భాగంగా న్యూస్9 ప్లస్ ముంబై 1993 దాడుల సూత్రధారిపై, వెబ్ సిరీస్ ప్రసారం చేస్తోంది. ది జిహాదీ జనరల్(The Jehadi General) పేరుతో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సిరీస్ కోసం న్యూస్9 ప్లస్ ప్రముఖ డొమైన్ నిపుణులతో మాట్లాడి 1993 పేలుళ్ల వెనుక కుట్రను మరింత లోతుగా అధ్యయనం చేసింది. వీరిలో మాజీ రా చీఫ్ విక్రమ్ సూద్, మాజీ యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి & ఐఎస్ఐ పుస్తక రచయిత ప్రొఫెసర్ ఓవెన్ ఎల్ సిర్ర్స్, మాజీ ముంబై పోలీస్ కమీషనర్ ఎంఎన్ సింగ్, పాకిస్తాన్‌లోని భారత మాజీ హైకమిషనర్ జి పార్థసారథి, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్‌లో సీనియర్ పరిశోధకుడు డాక్టర్ ప్రేమ్ మహదేవన్ లాంటి వారు ఉన్నారు.

మార్చి 12, 1993న భారత గడ్డపై జరిపిన ఈ దాడిలో ఒక విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోపాటు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, స్థానిక మాఫియా గ్రూపు సభ్యులు ఈ ఘాతుకంలో పాలుపంచుకున్నారు. ఆ సమయంలో ISIకి లెఫ్టినెంట్ జనరల్ జావిద్ నాసిర్ నేతృత్వం వహించారు.

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్‌లో సీనియర్ పరిశోధకుడు ప్రేమ్ మహదేవన్ న్యూస్9 ప్లస్‌తో కీలక విషయాలను పంచుకన్నారు. 1993 పేలుళ్లలో రెండు ప్లాన్‌లు ఉన్నాయని, ఒక ప్లాన్ బాంబు పేలుళ్లు, మరొకటి ముంబైలో సామూహిక కాల్పులు జరపాలని పక్కగా స్కెచ్ వేశారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆ మాఫియా గ్రూప్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ అని అందరికీ తెలిసిందే. వారి లక్ష్యం దేశ ఆర్థిక నంగరంలో అల్లకల్లోలం చేయడం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వారి లక్ష్యం. దీన్ని సాధించడానికి వారు రెండు ప్లాన్స్‌తో రంగంలోకి దిగారు. కానీ, వారు మొదటి ప్లాన్‌ని మాత్రమే అమలు చేశారు. ఫలితంగా 257 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

ఇక రెండవ భాగం ముంబైలో అల్లర్లు నిర్వహించడం, మతపరమైన సున్నితమైన లక్ష్యాలపై కాల్పులు జరపడంగా ప్లాన్ చేశారు. ఇందుకోసం వారు కలాష్నికోవ్ రైఫిళ్లను తీసుకొచ్చారు. దాడి చేసిన బృందం బెదిరింపులకు గురైనందున ప్రణాళికలోని ఈ రెండో ప్లాన్‌ను అమలుపరచలేదు.

‘తొలి ప్లాన్ విధ్వంసం స్థాయిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వారు తమ ప్రణాళికలోని రెండవ ప్లాన్‌ని వదిలేశారు. 26/11 నాడు, అంటే 2008 ముంబై దాడులు జరిగి ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. విదేశాల నుంచి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే ఇది చేశారు. అయితే, ముంబైలో జరిగింది మాత్రం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లకు ప్రతీకారం తీర్చుకునే చర్య కానే కాదు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

“ఇది భారతదేశంపై యుద్ధం చేయడానికి అంతర్జాతీయ కుట్రలో భాగమే. సమస్య ఏమిటంటే, ఈ వార్తలు దేశీయ కోణంపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. సూటిగా చెప్పాలంటే విదేశీ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయని, దానిని అమలు చేసింది మాత్రం డీ కంపెనీ అంటే దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని ముఠానే’ అని తెలిపారు.

ఇందులో ISI పేలుడు పదార్థాలు, ఏడు టన్నుల ఆర్‌డీఎక్స్, దాదాపు 300 కలాష్నికోవ్ రైఫిల్స్‌ను రవాణా చేయడానికి ఏర్పాట్లు చేసింది. ప్రజలు ఎక్కువగా 26/11 గురించి యుద్ధ చర్యగా మాట్లాడుతుంటారు. అయితే ఇది మార్చి 12, 1993న ప్రారంభమైందని ఎవరైనా వాదించవచ్చు. ఒకరు మరింత వెనక్కి వెళ్లి పంజాబ్‌లో ఉగ్రవాదానికి పాకిస్తానీ మద్దతు ఉందని చెబుతుంటారు. అయితే, ఇది భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు చాలా కాలంగా సాగుతున్న రహస్య ప్రచారంలో భాగంగా జరిగింది. అయితే మార్చి 12న దీనిని అమలు చేశారు’ అంటూ ప్రేమ్ మహదేవన్ వెల్లడించారు.

The Jehadi General వెబ్ సిరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్నిజాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..