
Astrology Tips: కొందరు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంటారు. చేసిన తప్పులను, పొరపాట్లను కవర్ చేసుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంటారు. అబద్ధాలే పరమావధిగా వారు జీవిస్తున్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ఇలాంటి స్వభావం కలిగిన వారు నిత్యం మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. వారు చెప్పే అబద్ధాలను వింటూనే ఉంటాం. కొందరు ఈ అబద్ధాలను గుడ్డిగా విశ్వసిస్తే.. మరికొందరి నిజానిజాలు తెలుసుకుని రియాక్ట్ అవుతుంటారు. అయితే, నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే.. వ్యక్తులు, వారి మనస్తత్వాలు, ఆలోచనా విధానాలు కూడా భిన్నంగా ఉంటాయి. అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీసేవారు కొందరుంటే.. నిజాయితీయే పరమావధిగా జీవించేవారు మరికొందరు ఉంటారు. ఏ పనిలో అయినా నిజాయితీ ప్రదర్శిస్తూ.. సత్యవంతులుగా ఉంటారు. ఏది ఏమైనా సత్యానికి విరుద్ధంగా మాత్రం వెళ్లరు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి రాశిచక్రం వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది. వారి ప్రత్యేక స్వభావాలు, లక్షణాల గురించి తెలుపుతుంది. అయితే, కొన్ని రాశుల వారు నిజాయితీకి మారుపేరుగా ఉంటారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వారు అస్సలు అబద్ధాలు చెప్పరని, నిజాయితీకి నిలువద్దంలా ఉంటారని జ్యోతిష్యశాస్రం చెబుతోంది. మరి ఆ రాశులు ఏంటో ఓసారి చూద్దాం..
వృషభం రాశికి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందానికి ప్రతిరూపంగా శుక్రుడిని భావిస్తారు. ఈ గ్రహ ప్రభావం వృషభ రాశి వారిపై ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగానే అచంచలమైన నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. వీరి అబద్ధాలు చెప్పరట. సత్యాన్ని విశ్వసిస్తారని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంటుంది. ఈ రాశి వారు తమ బంధాలకు విలువనిస్తారు. సామరస్యంగా ఉంటారు. అబద్ధాలకు పూర్తి వ్యతిరేకులు. అబద్ధాలు మనశ్శాంతికి భంగం కలిగిస్తాయిన ఈ రాశి వారు దృఢంగా విశ్వసిస్తారు. విధేయత, నిబద్ధతను కలిగి ఉంటారు.
ధనస్సు రాశికి అధిపతి, పాలకుడు బృహస్పతి. ఈ గ్రహం జ్ఞానం, అభివృద్ధికి మారు పేరుగా పేర్కొంటారు. ధనస్సు రాశి వారు ముక్కుసూటితనం, నిజాయితీకి ప్రతిరూపంగా ఉంటారు. వీరు అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సత్యాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తారు. ధనుస్సు రాశివారు స్వతహాగా సత్యాన్వేషకులు. ఓపెన్ మైండెడ్ స్వభావం కలిగి ఉంటారు. అన్నింటికంటే నిజాయితీకి విలువనిస్తారు.
మకరం రాశికి శని గ్రహం అధిపతిగా పేర్కొంటారు. క్రమశిక్షణ, బాధ్యతకు ప్రతిరూపం శనిదేవుడు. ఈ రాశి వారిలో నిజాయితీ ఉంటుంది. నైతికత, సమగ్రతకు ఎంతో విలువనిస్తారు. ఈ రాశి వారు నిజాయితీయే నమ్మకానికి పునాది అని విశ్వసిస్తారు. ఎలాంటి బాధ్యతనైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అలాగే వారి మాటల్లో ఎప్పుడూ నిజం ఉంటుంది. అబద్ధాలు చెప్పేందుకు ఏమాత్రం ఇష్టపడరు.
కుంభరాశికి యురేనస్(వరణుడు) అధిపతి. నూతన ఆలోచనా విధానాలకు, అద్భుతమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ గ్రహం ప్రభావంతో ఈ రాశివారు ప్రగతిశీల, నిజాయితీ స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు. కుంభరాశి వారు నిజాలు మాట్లాడేందుకు ఏమాత్రం భయపడరు. సత్యానికి కట్టుబడి ఉండేవారిని సమాజం ఎల్లప్పుడూ తిరుగుబాటుదారులుగా భావిస్తుంది. అయితే, ఈ రాశి వారు అవేవీ పట్టించుకుండా నీతి, నిజాయితీకి కట్టుబడి ఉంటారు. అబద్ధాలు ప్రగతికి ఆటంకం అని, నిజాయితీ సమాజానికి మేలు చేస్తుందని నమ్ముతారు.
ఈ రాశికి అధిపతి నెఫ్ట్యూన్. అంతర్‌దృష్టి, తదాత్మ్యానికి ప్రతిరూపంగా ఈ గ్రహాన్ని భావిస్తారు. ఈ రాశివారు చాలా సున్నిత మనస్కులు. కలలు కనే, సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే, వీరు ఇతరుల భావాలకు ఎంతో విలువ ఇస్తారు. అబద్ధం ఎదుటివారిని బాధిస్తుందని నమ్ముతారు. అందుకే వారు కూడా నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. భావోద్వేగ సామరస్యాన్ని కొనసాగించాలని కోరుకుంటారు. దయా గుణంతో, నిజాయితీగా ఉంటారు.
గమనిక: పై పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని, మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..