Importance Of Shells: గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం .. ఈ గవ్వల ఏ స్థానంలో ఉంటే ధనానికి లోటు ఉండదో తెలుసా..!

|

Jun 02, 2021 | 1:26 PM

Importance Of Shells: సముద్రంలో సహజ సిద్ధంగా లభించే వాటిల్లో గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు ఇలా అనేకం ఉన్నాయి. ఐతే గవ్వలకు, శంఖాలకు హిందూ...

Importance Of Shells: గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం .. ఈ గవ్వల ఏ స్థానంలో ఉంటే ధనానికి లోటు ఉండదో తెలుసా..!
Loxmi Devi
Follow us on

Importance Of Shells: సముద్రంలో సహజ సిద్ధంగా లభించే వాటిల్లో గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు ఇలా అనేకం ఉన్నాయి. ఐతే గవ్వలకు, శంఖాలకు హిందూ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకనే ఇంట్లో పెద్దలు ఉంటె.. సాయంత్రం 6 గంటల సమయంలో గవ్వలను ఆడనివ్వరు. ఆ శబ్దం ఆ సమయంలో వినిపించరాదని అంటారు. అంతేకాదు… ఇప్పటికీ కొన్ని ప్రాంతంలో పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ.. దీపావళి రోజున గవ్వలను ఆడుతూనే ఉన్నారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది.

సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి గవ్వలు చెల్లెల్లు అని, శంఖాలు సోదరులనీ భావిస్తుంటారు. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని విశ్వాసం. అయితే ఈ గవ్వలతో లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందమైన ఆభరణాలుగా అలంకరించాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది.
పంచతంత్రంలో ఒక చోట “చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు.” అని ఉంది. కనుక మన హిందూ సంప్రదయంలో గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.

ఈ గవ్వలను పెద్దలు పలు రకాలుగా ఉపయోగిస్తారు.

1) పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కడతారు.
2) కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసే అలవాటు ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగుతుంది.
3) గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. ఇక నూతనంగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అని పెద్దల ఉవాచ.
4) గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.
5) గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులుకు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.
6) వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన త్వరగా పెళ్లి అవుతుంది.
7) వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా సాగుతుంది.
8) పూర్వకాలంలో మంత్రికే తాంత్రిక విద్య సమయంలో.. వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకునేవారని పలు కథనాల ద్వారా తెలుస్తోంది.
9) గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.

Also Read: వృక్ష రూపంలో కొలువైన నరసింహస్వామి దివ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా..!