హిందూ ధర్మంలో దీపావళికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ధంతేరస్ రోజున ప్రారంభమై భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. ధన్తేరస్ రోజున కుబేరుడు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజున చిత్తశుద్ధితో పూజించడం వల్ల కుటుంబానికి ఆశీస్సులు, ఇంట్లోని సభ్యులకు ధన వర్షం కురుస్తుందని నమ్మకం. ధన్‌తేరస్ రోజు గురించి అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ రోజున కొంతమంది పాత్రలు కొంటారు. మరికొందరు వెండి వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం శుభపరిణామంగా భావిస్తారు. మరికొందరు బంగారం కొనేందుకు ఇష్టపడుతారు. ధన్‌తేరస్ రోజున చీపుర్లు కొనేందుకు చాలా క్రేజ్ ఉంటుంది. ఈ రోజున చీపురు ఎందుకు కొంటారో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం, ధంతేరస్ రోజున ఏది కొనుగోలు చేసినా అది భవిష్యత్తులో పదమూడు రెట్లు పెరుగుతుంది. ధంతేరస్ రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మత్స్య పురాణంలో చీపురు లక్ష్మీదేవి రూపంగా చెప్పబడింది. ఈ రోజున చీపురు కొనడం ఆనందం, శాంతి, సంపద చీపురుతో ముడిపడి ఉంటుంది. చీపురు ఇంటి దారిద్ర్యాన్ని తొలగిస్తుందని నమ్ముతారు.
ధంతేరస్ రోజున చీపురు కొనడం గురించిన మరో నమ్మకం ఏంటంటే, లక్ష్మీదేవి ఇంటిని విడిచిపెట్టదు. దీనితో పాటు, ఈ రోజున చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల పాత అప్పులు తొలగిపోతాయని, ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు.
ధంతేరస్ రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు చాలా మంది కొత్త బట్టలు కూడా కొంటారు. మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ధన్తేరస్ రోజు కొనడం మంచిదే.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం