Jaya Ekadashi: జయ ఏకాదశి.. ఆరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!

ఈ ఏడాది మాఘమాసంలో శుక్లపక్షం ఏకాదశి తిథి నాడు అంటే జనవరి 29న రవియోగం ఏర్పడుతోంది. ఈ రోజునే ఏకాదశి వస్తోంది. దీనిని జయ ఏకాదశి అంటారు. ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల పూజా ప్రత్యేకం. ఈరోజున కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. దీంతో వారి నివాసంలో సానుకూల వాతావరణంతోపాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

Jaya Ekadashi: జయ ఏకాదశి..  ఆరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..!
Laxmi Narayana

Updated on: Jan 26, 2026 | 5:43 PM

హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశిని పవిత్రంగా భావిస్తారు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఈరోజు ఉపవాసాలతోపాటు వ్రతాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజు చేసే వ్రతం ప్రత్యేకమైనదని చెబుతుంటారు. ఈ ఏడాది మాఘమాసంలో శుక్లపక్షం ఏకాదశి తిథి నాడు అంటే జనవరి 29న రవియోగం ఏర్పడుతోంది. ఈ రోజునే ఏకాదశి వస్తోంది. దీనిని జయ ఏకాదశి అంటారు. ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల పూజా ప్రత్యేకం. ఈరోజున కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. దీంతో వారి నివాసంలో సానుకూల వాతావరణంతోపాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

జనవరి 29న వచ్చే జయ ఏకాదశి రవి యోగంలో రానుండటంతో విశేషమైన ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. ఏకాదశి అనేది శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. జయ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుందని, దీంతో అన్ని ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.

జయ ఏకాదశి.. హిందూ పంచాంగం ప్రకారం.. మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి జనవరి 28న సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి జనవరి 29న మధ్యాహ్నం 1:55 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, ఉదయించే తేదీ ప్రకారం.. ఈ సంవత్సరం జయ ఏకాదశి ఉపవాసం జనవరి 29న పాటించడం జరుగుతుంది.

జయ ఏకాదశి పూజా విధానం

జయ ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి, తల స్నానం చేయాలి.
లక్ష్మీనారాయణలను ప్రార్థించాలి.
ఇల్లంతా గంగా జలం లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేయాలి.
సూర్యనారాయణుడుకి అర్ఘ్యం సమర్పించి, పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల విగ్రహాలను లేదా ఫొటోలను ప్రతిష్టించాలి.
శ్రీ మహా విష్ణువును పూజించడానికి పసుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం.
పసుపు రంగు పండ్లు, పువ్వులు, పాయసం, తెలుపు స్వీ్ట్లను దానం చేయండి.
విష్ణువుకు సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలు, స్లోకాలు పఠించాలి.
ఆ తర్వాత మంగళ హారతి ఇచ్చి.. సిరిసంపదల కోసం లక్ష్మీనారాయణులను ప్రార్థించాలి.
రాత్రిపూట భజన కీర్తనలతో జాగరణ చేయడం మంచిది.
మరుసటి రోజు ద్వాదశినాడు ఉదయం పూజ ముగించుకుని, బ్రాహ్మణులకు లేదా పేదలకు దానధర్మాలు చేసి భోజనం చేయాలి.

జయ ఏకాదశి వ్రతం ఫలితాలు..

జయ ఏకాదశి వ్రతాన్ని ఉపవాసం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. అకాల మృత్యుభయం తొలగిపోతుంది. అంతేగాక, మరణాంతరం మోక్షం ప్రాప్తిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సిరిసంపదలు కలుగుతాయి. జయ ఏకాదశి వ్రతంతో పితృదేవతలకు శాంతి లభిస్తుంది. దీంతో వారి ఆశీస్సులు అందుకుంటారు.

తులసి కోట దగ్గర దీపారాధన చేయడంతోపాటు విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి తాండవం చేస్తుందని, వారి ఇంట్లో స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీంతో వారి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవని, సిరిసంపదలు వస్తాయని చెబుతున్నారు. ఏకాదశి వ్రతం చేయడం వల్ల బ్రహ్మ హత్యా పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే జయ ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణులను ఆరాధించడం వల్ల వారి ఇంటికి సిరిసంపదలు వెతుక్కుంటూ వస్తాయని విశ్వసిస్తారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)