తెలుగు నెలల్లో చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసం మాఘమాసం. చంద్రుడు మఖ నక్షత్రంతో ఏర్పడే మాసం కనుక మాఘమాసం అయింది. అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టే మాఘమాసమునకు ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల శ్రీ మహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చేసే నదీస్నానం.. శ్రీమన్నారాయణుని పూజ ఇచ్చే దానం.. కోటి క్రతువుల ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది. ఈ మాసంలో తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరిస్తారు. ప్రత్యేక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజిస్తారు.
స్నానం చేస్తూ పఠించాల్సిన శ్లోకం:
దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం ” అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ.. నదిలో, లేదా బావుల వద్ద స్నానం చెయ్యడం వలన విశేష ఫలితం లభిస్తుంది. నదుల్లో స్నానం చేయడానికి వీలుకాని యెడల కనీసం ఇంట్లో స్నానం చేసి సమయంలోనైనా గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.
స్నానాంతరం పాటించాల్సిన నియమాలు:
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)