Pydithalli Temple Vizianagaram: ఉత్తరాంధ్రుల కల్పతరువు పైడితల్లి దేవస్థానం పాలకవర్గం ఇవాళ కొలువుతీరనుంది. విజయనగరంలో ఆలయ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది. పైడితల్లి కళ్యాణమండపంలో ఏర్పాట్లు చేశారు అధికారులు. కొన్నేళ్లుగా తాత్కాలిక పాలకవర్గంతోనే అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేవారు.. అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ ఇన్నాళ్లకు శాశ్వత పాలకమండలిని ఏర్పాటు చేసింది. గత ఏడాది డిసెంబరు 8న ప్రభుత్వం జీవో నెంబరు 778 ప్రకారం శాశ్వత పాలకమండలిని ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్, ఎక్స్ అఫీసియో సభ్యుల్ని కలుపుకొని మొత్తం 10 మందిని నియమించగా మరో నలుగుర్ని ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా నియమించింది. వీరి ప్రమాణ స్వీకారం ఇవాళ సాయంత్రం 5.10 నిముషాలకు పైడితల్లి దేవస్థాన కల్యాణమండపంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రమాణ స్వీకారానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు హజరుకానున్నారు. దీంతో ఈ కార్యక్రమం ఉత్కంఠ రేపుతోంది. పాలకమండలి సభ్యులు.. వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కావడంతో చైర్మన్ అశోక్ గజపతి హాజరుకావడంపై ఉత్కంఠ ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వంపై అశోక్‌గజపతిరాజు పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తుండటంతో ఆలయ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంపై ఉత్కంఠ ఏర్పడింది.
ఇవి కూడా చదవండి: Dharmavaram Politics: హాట్ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..
గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..