Vivah Panchami: వివాహం ఆలస్యం అవుతుందా. అయితే వివాహ పంచమి వ్రతం ఆచరించండి.. ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందంటే..

|

Nov 25, 2021 | 9:01 PM

Vivah Panchami 2021 Date:ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసం శుక్ల పక్షం ఐదవ రోజున వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు సీతారాముల వివాహం జరిగిన రోజు. కనుక వివాహ పంచమి రోజున,..

Vivah Panchami: వివాహం ఆలస్యం అవుతుందా. అయితే వివాహ పంచమి వ్రతం ఆచరించండి.. ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందంటే..
Vivah Panchami 2021 Date
Follow us on

Vivah Panchami 2021 Date: మార్గశిర మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున హిందువులు వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత అనేక పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజున ప్రభు శ్రీరాముడు తల్లి సీతను వివాహం చేసుకున్నాడని భక్తుల విశ్వాసం. కనుక ప్రతి సంవత్సరం ఈ రోజును వివాహ పంచమిగా సీతారాముల వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటారు.

ఈ ఏడాది వివాహ పంచమి డిసెంబర్ 8 బుధవారం వచ్చింది. ఈ రోజున సీతా-రాముల ఆలయంలలో ఘనంగా వేడుకలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాలలో శ్రీ రామచరితమానస్ పారాయణం చేస్తారు. మిథిలాంచల్ , నేపాల్‌లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే నేపాల్‌ తల్లి సీత జన్మ స్థలమని నమ్మకం. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత, పవిత్రమైన సమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం..

వివాహ పంచమి ప్రాముఖ్యత:
వివాహంలో అడ్డంకులు ఎదురైనా వారికి ఈ వివాహ పంచమి రోజు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వివాహ పంచమి రోజున, పెళ్లికాని వారు శ్రీరాముడు, సీత మాతని పూజించాలి. ఉపవాసాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే వివాహానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని పురాణాల కధనం. అంతేకాదు అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. ఇక వివాహ పంచమి రోజున పెళ్లయిన వారు ఈ వ్రతాన్ని పూర్తి భక్తితో ఆచిరిస్తే.. వారి వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తొలగి వైవావిక జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయని విశ్వాసం. అంతేకాదు వివాహ పంచమి రోజున ఇంట్లో రామచరితమానస్ పారాయణం చేస్తే, ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.

ఇది శుభ సమయం
వివాహ పంచమి తేదీ 07 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమయి.. 08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.

పూజా విధానం
ముందుగా, స్నానమాచరించి, సీతారాములను స్మరణ చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. అనంతరం ఒక ప్రాంతంలో గంగాజలం చిలకరించి, ఎరుపు లేదా పసుపు బట్ట పరచి, సీతరాముల విగ్రహాలను ప్రతిష్టించండి. శ్రీరామునికి పసుపు వస్త్రాలు, సీతమాతకి ఎరుపు రంగు దుస్తులు ధరింపజేయాలి. ఆ తర్వాత, అక్షత, పూలు, ధూపం, దీపాలతో పూజించాలి. ప్రసాదం నైవేధ్యం పెట్టి వివాహ పంచమి కథను చదవండి. అనంతరం.. ‘ఓం జానకీ వల్లభాయై నమః’ అనే మంత్రాన్ని 1, 5, 7 లేదా 11 సార్లు జపించండి. పూజానంతరం, మీ జీవితంలోని కష్టాలను తొలగించమని ప్రార్థించండి. ఆ తర్వాత ఇంటింటికీ ప్రసాదాన్ని పంచండి.

Also Read:   అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదట.. రోజూ 5 నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

 శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్లను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఎప్పుడంటే..