Visakhapatnam: విశాఖపట్నంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ( Sri Venkateswara Swamy temple)నిర్మాణం పూర్తి అయింది. ఈ ఆలయ మహాసంప్రోక్షణ(Mahasamprokshana) కార్యక్రమాలు మార్చి 18 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్నామని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణ కోసం టీటీడీ ఆలయ, పరిపాలన సిబ్బంది తగినంత మందిని డెప్యుటేషన్‌పై పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. అన్నప్రసాదాల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. అటవీ, ఉద్యానవన విభాగాల ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. భక్తుల కోసం పాదరక్షలు భద్రపరుచుకునే కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. మహా సంప్రోక్షణ కార్యక్రమాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సర్వాంగ సుందరంగా విద్యుత్ అలంకరణ పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగరబత్తీలు, ఫొటోఫ్రేమ్‌లు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం వద్ద గల ధ్యానమందిరంలో శబ్దం రాకుండా ప్రశాంతంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం వద్ద సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, భక్తులు తిలకించేందుకు డిస్‌ప్లే స్క్రీన్లు అమర్చాలని ఆదేశించారు.
అనంతరం ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో అధికారులతో సమీక్షించారు.
Also Read :