Simhachalam Temple: ఈ నెల 23న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. లక్షాది మంది వస్తారని అంచనా.. ఆన్లైన్ టికెట్ల అమ్మకంలో గందరగోళం

|

Apr 20, 2023 | 7:23 AM

సింహాచలం దేవస్థాన ప్రస్థానంలో చందనోత్సవం కు ప్రత్యేక స్థానం. ఈ సందర్భంగా స్వామివారి నిజరూపదర్శనం ఉంటుంది. ఈ ఉత్సవానికి కనీసం లక్షా యాభై వేల మంది వస్తారని అంచనా. ఉత్తరాంధ్ర తో పాటు తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ ఉత్సవాలకు హాజరవుతుంటారు.

Simhachalam Temple: ఈ నెల 23న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. లక్షాది మంది వస్తారని అంచనా.. ఆన్లైన్ టికెట్ల అమ్మకంలో  గందరగోళం
Simhachalam Temple
Follow us on

పేరుకే దర్శనాలలో సామాన్యులకే పెద్ద పీట. కానీ ఆ పీట ప్రోటోకాల్ వాళ్ళకే. వీఐపీ లెటర్ లేకుండా దేవుడిని దర్శించుకోవాలంటే ఆరోజు రెండు మూడు సార్లు ఆ దేవుడే ప్రత్యక్షం గా కనపడ్డాకే ఆ గుడిలో ఆయన విగ్రహ దర్శనం అవుతుంది. ఉదయం 10 గంటల వరకు 300, 1000 రూపాయల వాళ్లకు దర్శనమే లేదట..కానీ 1500 రూపాయల టికెట్ వాళ్లకు మాత్రం ఉంటుంది కానీ ఆ టికెట్ దక్కించుకోవాలంటే మళ్లీ ఏదో ఒక రాజకీయనాయకుడి కాళ్ళు మొక్కాలట. అప్పుడే దేవుడి దర్శనం అట. దేవుడి దర్శనానికి సామాన్యుడి కే పెద్ద పీట అంటూ అధికారులు, రాజకీయ నేతలు ఆడుతున్న చీప్ డ్రామా ఏంటో తెలుసా..

సింహాచలం దేవస్థాన ప్రస్థానంలో చందనోత్సవం కు ప్రత్యేక స్థానం. ఈ సందర్భంగా స్వామివారి నిజరూపదర్శనం ఉంటుంది. ఈ ఉత్సవానికి కనీసం లక్షా యాభై వేల మంది వస్తారని అంచనా. ఉత్తరాంధ్ర తో పాటు తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ ఉత్సవాలకు హాజరవుతుంటారు. ఇందుకోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెట్ల విక్రయాలు గందరగోళంగా మారినట్లు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎస్ బి ఐ, యూనియన్ బ్యాంక్ లలో విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉన్నా ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా అక్కడ ఆలస్యం అవుతూ ఉన్నాయి. దీంతో పలువురు భక్తులు బ్యాంకులకు వచ్చి వెనుదిరగాల్సి వెళ్లాల్సి వస్తోంది. దేవాదాయశాఖ పోర్టల్లో ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు భక్తులు ఉదయం నుంచి వేచి ఉన్నా… 300, వెయ్యి టికెట్లు వెబ్సైట్లో చూపినప్పటికీ స్లాట్లో నిర్దేశించిన టికెట్లు అందుబాటులో లేవని మెసేజ్ రావడంతో భక్తులు నిరాశకు గురవుతున్నారు.

దర్శనానికి రూ.300, రూ. వెయ్యి టికెట్లకు సంబంధించి మూడు స్లాట్లను ఆన్లైన్లో కేటాయించారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట, మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్లాట్లు కేటాయించారు. ఉదయం 10. గంటలకు ముందు 300, 1000 రూపాయల స్లాట్ లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామునే దర్శనాలకు వచ్చి వెళ్లాలనుకునే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు ఇబ్బంది పడే అవకాశం ఉందని వాపోతున్నారు. వెయ్యి రూపాయల దర్శనం టికెట్లు ఆన్లైన్లో పెట్టకుండానే 2వేల వరకు విక్రయించినట్లు అధికారులు చెప్పడంపైనా భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 7 గంటల వరకు ఆన్లైన్లో స్లాట్లు చూపించనప్పుడు ఇన్ని ఎలా అమ్ముడుపోయాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పారదర్శకత కోసం ఆన్లైన్ టికెట్లు ప్రవేశపెట్టినా పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖ పోర్టల్ ద్వారా రూ. వెయ్యి, రూ.300 టికెట్లు రోజుకు 2 వేలు చొప్పున భక్తులకు
అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక 1500 రూపాయల టికెట్ల మిస్టరీ ఎప్పటికీ వీడనిది. ఇవి అసలు సాధారణ ప్రజలకు అమ్మరు.. వీటి కోసం పెద్ద యెత్తున పైరవీలు చేయాలి. పైరవీలు చేయాలని తెలిసినా స్వయంగా కలెక్టర్ నే పైరవీ లెటర్ల ఆధారంగా ఈ టికెట్ల కేటాయింపు జరుగుతుందట. ఇవి ఎన్ని ఇస్తారో, ఏ స్లాట్ లో వీటిని ఆనుమతిస్తారో అన్ని గోప్యంగా ఉంచుతారు..ఒకవేళ చెప్పినా వాళ్ళు చెప్పిన దానికి ఇచ్చే దానికి పొంతనే ఉండదు. డబ్బులు పెట్టీ అమ్మెప్పుడు అందరికీ అందుబాటులో ఉంచాలన్నది ప్రధాన డిమాండ్ అయినా పట్టించుకునే నాథుడే లేరు. ఇక దేవుడి ని దర్శించుకునే వాళ్లకు గుడిపై దేవుడే దిక్కు కానున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..