బెజయవాడ దుర్గమ్మ దర్శనం దక్కేది ఎలా..? సర్వదర్శనానికి దారేది..? కొండంతా కమర్షియల్‌‌ అంటున్న సామాన్య భక్తులు

| Edited By: Team Veegam

Mar 26, 2021 | 7:41 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో తరలివస్తారు. ప్రతి ఒక్క భక్తుడికి టిక్కెట్‌ కొనే స్థోమత ఉండదు కాబట్టి.. ఎక్కువమంది..

బెజయవాడ దుర్గమ్మ దర్శనం దక్కేది ఎలా..? సర్వదర్శనానికి దారేది..? కొండంతా కమర్షియల్‌‌ అంటున్న సామాన్య భక్తులు
Vijayawada Indrakeeladri
Follow us on

Indrakeeladri Darshan: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో తరలివస్తారు. ప్రతి ఒక్క భక్తుడికి టిక్కెట్‌ కొనే స్థోమత ఉండదు కాబట్టి.. ఎక్కువమంది ఉచిత దర్శనానికి వెళ్తారు. అయితే సర్వదర్శనానికి వెళ్లే భక్తులను ఆలయ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కేవలం వంద లేదా 3 వందల రూపాయల టిక్కెట్లు కౌంటర్లకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉచిత దర్శనానికి కనకదుర్గానగర్‌ దగ్గర ఉన్న శృంగేరిపీఠం అన్నదాన సత్రం వద్ద టిక్కెట్లు ఇస్తున్నారు. దీనిపై సామాన్యభక్తులకు పెద్దగా అవగాహన లేదు. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లోగానీ..అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గంలో ఎక్కడా ఉచిత టిక్కెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేయలేదు. కేవలం ఒకే ఒక కౌంటర్‌ను అది కూడా గుడికి ఆమడదూరంలో పెట్టి సామాన్య భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి.

ఘాట్‌రోడ్డులో దర్శనానికి వెళ్లిన భక్తులకు వంద, 300కి మాత్రమే అనుమతి ఉందని సామాన్యభక్తులను వెనక్కి పంపేస్తున్నారు. అక్కడి నుంచి కొండకిందకి వెళ్తే..ఉచిత దర్శనం క్యూలైన్‌ వద్దకు వెళ్తే కనకదుర్గానగర్‌ వద్దకు వెళ్లి టికెట్‌ తెచ్చుకోవాలని చెబుతున్నారు ఆలయ సిబ్బంది. దీంతో భక్తులు కొండపైకి…కిందకు తిరుగుతూ చివరకు ఉచిత దర్శనానికి ఎందుకొచ్చామురా బాబూ అనుకుంటూ వెనక్కి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. చివరకు కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన లిఫ్టులు సైతం నిలిపివేసి భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఆలయ సిబ్బంది. డబ్బుపెట్టి ప్రతి ఒక్క భక్తుడు టిక్కెట్లు కొనలేరని ..ఇప్పటికైనా ఆలయ అధికారులు దీనిపై దృష్టిపెట్టి ఉచిత టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

డబ్బులు లేకుండా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోలేకపోతున్నారు భక్తులు. అంతా కమర్షియల్‌గా మార్చేశారు ఆలయ అధికారులు. చెప్పుల స్టాండ్‌ మొదలు, మొబైల్‌ కౌంటర్‌, లగేజీ కౌంటర్‌, లడ్డూ ప్రసాదాలు, పార్కింగ్‌కి డబ్బులు..ఆఖరికి అమ్మవారిని షార్ట్‌కట్‌లో దర్శనం చేసుకోవాలన్న డబ్బులు కావాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సామాన్యభక్తులపై దృష్టిపెట్టి ఇబ్బందులను తొలగించాలని జనం కోరుతున్నారు.