Ganesh Chaturthi 2025: ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటున్నారా..? అయితే, ముందుగా ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..

వినాయక నవరాత్రులు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు భారీ మండపాలు, సెట్టింగులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న వినాయక చతుర్ధితి నిర్వహించానున్నారు. ఇకపోతే, మన హిందూమతంలో గణేశుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది..గణపతి మనందరికీ అది దేవుడు. ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని పూజించడం తప్పనిసరి. అయితే, వినాయక చవితి వేళ వాస్తు శాస్త్రం ప్రకారం గణపతిని ఇంట్లో ఏ దిశగా పెట్టుకోవాలి. జ్యోతిష్య వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే...

Ganesh Chaturthi 2025: ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటున్నారా..? అయితే, ముందుగా ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
Ganesh Chaturthi

Updated on: Aug 20, 2025 | 2:40 PM

వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్యం వైపు ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని పశ్చిమం, దక్షిణ దిశలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే ఆర్థిక ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. వినాయకుడి విగ్రహాన్ని తూర్పు వైపు చూసేలా పెట్టండి. ఇలా చేయడం వల్ల సానుకూలత పెరుగుతుంది. పాజిటివిటీ పెరుగుతుంది. వినాయకుడి విగ్రహం వెనుక భాగాన్ని గోడకు ఆనించి ఉంచండి. ఇలా చేయడం వల్ల స్థిరత్వం పెరుగుతుంది.

తొండంకుడివైపునకు తిరిగి ఉన్న తొండం గల వినాయకుడిని సిద్ధి వినాయకుడిగా పిలుస్తారు. కానీ, చాలావరకు ఇంట్లో ఎడమవైపు తిరిగి ఉన్న విగ్రహం ఉంచాలి. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయి. కుడివైపు తిరిగి ఉన్న విగ్రహం ప్రతిష్ఠా విధానం, పూజా విధానానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. పూజ గదిలో వినాయకుడి విగ్రహం ఉండేటట్టు చూసుకోండి. పూజ గదిలో వినాయకుడి విగ్రహం ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ విధంగా వినాయకుని అనుగ్రహం కలుగుతుంది.

విగ్రహం ఎప్పుడూ మరీ పెద్దదిగా లేదా చిన్నదిగా ఉండకూడదు. మద్యస్థమైన విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం మంచిది. ప్రతిరోజు వినాయకుడి ముందు దీపం వెలిగించండి. ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. వినాయకుడి విగ్రహాన్ని పెట్టేటప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉండేటట్టు చూసుకోండి. అలా చేయడం వల్ల ధనం, ఐశ్వర్యం కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..