Vastu Tips: నాన్‌స్టాప్ ధనప్రవాహం కావాలంటే ఇంట్లో ఈ మొక్కలు ఉండాల్సిందే.. లిస్టులో ఏయే ప్లాంట్స్ ఉన్నాయంటే..?

|

Sep 17, 2023 | 11:40 AM

Vastu Tips: వాస్తు ప్రకారం అన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు. ముఖ్యంగా ముళ్లు ఉండే మొక్క ఏదైనా.. అది వాస్తు దోషానికి మూలమే. ఫలితంగా ఇంట్లో అశాంతి, ప్రశాంతతకు విఘాతం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో వివాదాలు తప్పవంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంట్లో కొన్ని..

Vastu Tips: నాన్‌స్టాప్ ధనప్రవాహం కావాలంటే ఇంట్లో ఈ మొక్కలు ఉండాల్సిందే.. లిస్టులో ఏయే ప్లాంట్స్ ఉన్నాయంటే..?
Vastu For Plants
Follow us on

Vastu Tips for Plants: వైదిక ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రముఖ పాత్ర ఉంది. పెద్దలు, నిపుణుల ప్రకారం వాస్తు మానవ జీవితాన్ని అన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగానే ఏ ఇల్లు నిర్మించాలనుకున్నా, లేదా ఇంట్లో ఏ నిర్మాణం చేయాలన్నా వెంటనే వాస్తు నిపుణులను సంప్రదిస్తారు. ఈ క్రమంలోనే ఇంటి వాస్తుకు అనుకూలంగా ఉండే కొన్ని రకాల వస్తువులను, మొక్కలను తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటారు. అయితే వాస్తు ప్రకారం అన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు. ముఖ్యంగా ముళ్లు ఉండే మొక్క ఏదైనా.. అది వాస్తు దోషానికి మూలమే. ఫలితంగా ఇంట్లో అశాంతి, ప్రశాంతతకు విఘాతం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో వివాదాలు తప్పవంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలని, ఫలితంగా ధన వైభోగం, సుఖం, ప్రశాంతత అన్నీ ప్రాప్తిస్తాయని చెబుతున్నారు.

షమీ మొక్క: వాస్తు ప్రకారం ఇంట్లో లేదా ఇంటి బయట షమీ మొక్క ఉండడం అన్ని విధాల మేలు చేస్తుంది. శని దేవుడికి ఎంతో ఇష్టమైన షమీ మొక్క వాస్తుశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో షమీ మొక్కను ఇంటి ప్రధాన ద్వారా, లేదా మెయిన్ గేట్ వద్ద ఉంచితే మూసుకుపోయిన అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. అలాగే శనిదేవుడు, శ్రీమహా లక్ష్మి కటాక్షం మీపై ఉంటుంది.

మల్లె మొక్క: మల్లె మొక్క ఎక్కడుంటే అక్కడ సువాసనలు ఉన్నట్లే. మల్లె మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లోని వారు ఎప్పుడూ ప్రశాంతంగా, మానసిక ఆరోగ్యంతో జీవించగలరు. పైగా మల్లె మొక్క ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 పామ్ ట్రీ: వాస్తు ప్రకారం పామ్ ట్రీని పెంచుకోవడం ఇంట్లోని వారికి ఎంతో మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటి ముఖ ద్వారా వద్ద పామ్ ట్రీ ఉండడం వల్ల ప్రతి కూల శక్తులు ఇంట్లోకి రావంట. అలాగే ఇంట్లోకి పాజిటీవ్ ఎనర్జీ మాత్రమే వచ్చి, ఇంట్లోనివారికి ప్రశాంతత, ఆరోగ్యాన్ని కలిగిస్తాయంట.

ఫర్న్ ప్లాంట్: వాస్తు ప్రకారం ఇంట్లో తప్పక ఉండాల్సిన మరో మొక్క ఫర్న్ ప్లాంట్. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ మొక్క ఇంటికి ఆకర్షణగా ఉంటుంది. దీన్ని కూడా ఇంటి ముఖ ద్వారం వద్ద ఇంటి ముఖ ద్వారా వద్ద పామ్ ట్రీ ఉండడం వల్ల ప్రతి కూల శక్తులు ఇంట్లోకి రావు, ఇంకా ఆదాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.