
వాస్తు శాస్త్రం మనిషి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. చదువు సమయంలో విద్యార్థుల మనస్సు తరచుగా చలిస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. వాస్తు ప్రకారం పిల్లలు చదువుకునే గదిని నిర్మించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ రోజు పిల్లల చదువు ఏకాగ్రతను మెరుగుపరచడంలో, పరీక్షలలో విజయం సాధించడంలో సహాయపడే పాటించాల్సిన వాస్తు చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
గదిని చిందరవందరగా ఉంచవద్దు: తల్లిదండ్రులు తమ పిల్లల లేదా విద్యార్థులు తమ గది లేదా స్టడీ రూమ్ చిందరవందరగా లేకుండా చూసుకోవాలి. చదువుకునే రూమ్ లో అనవసరమైన వస్తువులను వెంటనే తీసివేసి గదిని శుభ్రంగా ఉంచండి. చిందరవందరగా ఉన్న గది సానుకూల శక్తి ప్రవాహాన్ని ఆపుతుందని నమ్మకం. కనుక చదువుకునే పిల్లల ఏకాగ్రత కోసం.. మెదడు చురుకుగా పని చేసేందుకు ఎప్పుడూ గదిని శుభ్రంగా పెట్టుకోవాలి.
పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ కి ఈశాన్య లేదా తూర్పు దిశ బెస్ట్. ఎందుకంటే ఈ దిశలో కూర్చుని చదువుకోవడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశ ఏకాగ్రతకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. చదువుకునే దిశలో ఉన్న గోడ ఖాళీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా ఏదైనా ఫోటోలను ఏర్పాటు చేసుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునే గది లేదా వారి స్టడీ రూమ్ రంగు ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం ఉండాలి. రంగులు మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. స్టడీ రూమ్ గోడలను లేత నీలం రంగు లో లేదా లేత ఆకుపచ్చ రంగులో లేదా తెలుపు రంగులో పెయింట్ చేయండి. ఇలాంటి రంగులు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. పొరపాటున కూడా పిల్లలు చదువుకునే గదికి ముదురు రంగులను ఉపయోగించవద్దు.
వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు ఉండే గది వెంటిలేషన్ చేయబడితే పిల్లలు ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉంటారు. అందుకనే స్టడీ రూమ్ బాగా వెలుతురుతో ఉండాలి. దీంతో పిల్లలు మానసికంగా చురుకుదనంతో ఉంటారు. చదువు పట్ల ఏకాగ్రతను పెరుగుతుంది. అంతేకాదు స్టడీ రూమ్‌లో ప్లే రూమ్ ఉండేలా ప్రయత్నించండి.
భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం మనుషుల చుట్టూ ఉన్న వాతావరణంలో శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. కనుక విద్యార్థులు లేదా పిల్లలు చదువుకునే గదిలో మొక్కలను ఉంచుకోవాలి. ఇలా ఇండోర్ ప్లాంట్స్ ని పెంచడం వలన సమతుల్యత ఏర్పడుతుంది. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టడానికి మొక్కలు సహాయపడతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు