Vastu Tips for Home: పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ చెట్లను, మొక్కలను నాటకండి, లేకపోతే మీ జేబులు ఖాళీ

|

Mar 02, 2024 | 11:27 AM

వాస్తు శాస్త్రం ప్రకారం, కాకర కాయ పాదుని ఇంట్లో ఎప్పుడూ పెంచకూడదు. ఇలా ఈ కాకరకయ తీగని ఇంట్లో పెంచుకోవడం వలన  ఇంటి ఆర్థిక స్థితి, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్మకం. కనుక ఇంట్లో కాకర మొక్కను నాటడం మంచిది కాదు. వాస్తు ప్రకారం కాకర కాయ పాదును ఇంట్లో నాటడం నిషేధించబడింది ఎందుకంటే చేదుగా ఉంటుంది. కనుక దీని నుండి వెలువడే శక్తి కూడా ప్రతికూలంగా ఉంటుంది.

Vastu Tips for Home: పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ చెట్లను, మొక్కలను నాటకండి, లేకపోతే మీ జేబులు ఖాళీ
Vastu Shastra
Follow us on

ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి, జమ్మి వంటి మొక్కలు  ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయి. అయితే ప్రతి మొక్క ఇంటికి శ్రేయస్కరం కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, కాకర కాయ పాదుని ఇంట్లో ఎప్పుడూ పెంచకూడదు. ఇలా ఈ కాకరకయ తీగని ఇంట్లో పెంచుకోవడం వలన  ఇంటి ఆర్థిక స్థితి, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్మకం. కనుక ఇంట్లో కాకర మొక్కను నాటడం మంచిది కాదు.

కాకార మొక్క వలన కలిగే అనర్ధాలు తెలుసా?

వాస్తు ప్రకారం కాకర కాయ మొక్కను ఇంట్లో నాటడం నిషేధించబడింది ఎందుకంటే చేదుగా ఉంటుంది. కనుక దీని నుండి వెలువడే శక్తి కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత వస్తుందని నమ్ముతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి ఏర్పడేలా చేస్తుంది.. ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది.

ఇంట్లో కాకార కాయ మొక్కను నాటడం కుటుంబ సభ్యుల పురోగతిని కూడా ప్రభావితం చేస్తుందని నమ్మకం.  కనుక ఇంట్లో కాకర మొక్కను పెంచుకోవడం సుఖ సంతోషాలకు అశుభకరమైనదిగా భావిస్తారు. కాకరకాయ నుంచి వెలువడే శక్తి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడవచ్చు. కనుక ఈ మొక్కను ఇంట్లో నాటడం నిషేధం అంటూ వాస్తు శాస్త్రం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఏయే చెట్లను ఇంట్లో నాటడం అశుభం అంటే

అంతే కాకుండా ఇంట్లో ముళ్ల మొక్కలు, ఈత చెట్టు, చింత చెట్టు, రావి చెట్టు వంటివి నాటడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. అయితే మీరు ఇంట్లో  ఇప్పటికీ కాకర కాయ తీగను పెంచాలనుకుంటే దానిని మీ ఇంటి వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు. అప్పడు ఇంటి సభ్యులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు