హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో, ఇంటి ఆవరణలో వాస్తు దోషాలను తొలగించడానికి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం అనేక రకాల నివారణ చర్యలు సూచించబడ్డాయి. మనిషి జీవితంలో చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. కొంతమందికి ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచడం ఎంతగానో ఇష్టం. అయితే చాలా సార్లు, తెలిసి, తెలియక చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయి. కష్ట, నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. దీంతో వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కల పెంపకానికి సరైన దిశ నిర్దేశించబడింది. చెట్లు, మొక్కలు నాటడం ద్వారా కూడా సుఖ సంపదలను పొందవచ్చు.
వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను ఇంట్లో తప్పుడు ప్రదేశంలో నాటడం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కరివేపాకు మొక్క చాలా మంది ఇళ్లలో విరివిగా పెరగడం చూస్తుంటాం. కొన్ని చోట్ల కరివేపాకు చెట్టు ఎండిపోయిన స్థితిలో ఉంటుంది.. అయితే ప్రతి వస్తువుకు దాని స్థానం ఉన్నట్లే ఇంట్లో పెంచుకునే కరివేపాకు మొక్కను నాటడానికి కూడా సరైన స్థానం ఉంది. దీని ప్రకారం, కరివేపాకులను నాటడానికి సరైన స్థలం ఏది? ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుందో జ్యోతిష్కులు చెప్పిన విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..
కరివేపాకు మొక్కలను జ్యోతిష్య శాస్త్రంలో మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కరివేపాకు క్యాన్సర్ , మధుమేహం నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులలో యాంటీ మ్యుటాజెనిక్ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు క్యాన్సర్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాదు గుండె జబ్బులు రాకుండా చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది. కరివేపాకు కళ్లకు కూడా మంచిదని భావిస్తారు.
ఫెంగ్ షుయ్ చిట్కాల ప్రకారం ఇంటి దక్షిణ మూలలో కరివేపాకులను నాటడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో కరివేపాకు మొక్కను పెంచడం ద్వారా సంపద, శ్రేయస్సును పొందవచ్చు. కాబట్టి ఈ దిశలో కరివేపాకు మొక్కను నాటండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు