Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్‌ని పెంచుకుంటున్నారా.. ఈ దిశలో పెడితే కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే..

|

Dec 09, 2024 | 4:53 PM

ఇంట్లో మనీ ప్లాంట్‌ను తప్పుడు ప్రాంతంలో పెట్టడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇంటి లోపల మనీ ప్లాంట్‌ను పెంచుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఇంట్లో గ్లాస్ బాటిల్‌లో మనీ ప్లాంట్ ఉంటే.. దానిలో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకుండా చుకోవాలి. మనీ ప్లాంట్ ఎండిపోతే ఇంట్లో సుఖ సంతోషాలకు ఆటంకం ఏర్పడవచ్చు.

Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్‌ని పెంచుకుంటున్నారా.. ఈ దిశలో పెడితే కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే..
Vastu Tips For Money Plant
Follow us on

వాస్తు శాస్త్రం మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రజలు వాస్తు ప్రకారం ఇళ్లు కట్టుకుంటారు. ఇంట్లో వస్తువులను వాస్తు ప్రకారం ఉంచుతారు. వీటిలో చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో ఇంట్లో చెట్లు , మొక్కలను పెంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాంటి మొక్కలలో ఒకటి మనీ ప్లాంట్. ప్రజల ఇళ్లలో, ఆఫీసు డెస్క్‌ వంటి ప్రాంతాల్లో మనీ ప్లాంట్‌లను పెట్టుకుంటారు.

అయితే వాస్తు శాస్త్రాన్ని విస్మరించి ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకుంటే మంచి, చెడు ఫలితాలు ఉంటాయి. మనీ ప్లాంట్‌ను ఇంట్లో తప్పుడు దిశలో ఉంచినట్లయితే లేదా పెంచుకున్నట్లు అయితే చెడు ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ పెంచుకోకూడదు. ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తప్పవు. మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో కాకుండా ఆగ్నేయ దిశలో పెంచుకోవాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఇవి కూడా చదవండి

ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఇంట్లో గ్లాస్ బాటిల్‌లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటే.. ఆ నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు. మనీ ప్లాంట్ ఎండిపోతే ఇంట్లో ఆనందం సంతోషం ఆవిరి అయిపోతుంది.

మనీ ప్లాంట్‌లో కొన్ని ఆకులు ఎండిపోతే వెంటనే వాటిని తొలగించండి. అంతేకాదు మనీ ప్లాంట్‌లోని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి. ఇలా జరగడం అశుభం. మీ మనీ ప్లాంట్ యొక్క తీగ నేలను తాకినట్లయితే లేదా దానిని తాకబోతున్నట్లయితే, దానిని ఒక దారంతో పైకి కట్టండి.

శుక్రవారం నాడు పచ్చి పాలను నీటిలో కలిపి మనీ ప్లాంట్‌లో పోయాలి. దీనితో మీ డబ్బు సంబంధిత సమస్యలు ముగియవచ్చు. మనీ ప్లాంట్ మూలానికి దగ్గర దారాన్ని కట్టితే ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ఇంట్లో నాటిన మనీ ప్లాంట్‌ను మరెవరికీ ఇవ్వకండి. మీరు ఇలా చేస్తే మీ ఆనందం మరియు శ్రేయస్సు దెబ్బతింటుంది.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.