Vastu Tips: ఈ సంకేతాలు పదేపదే కనిపిస్తే ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే.. జాగ్రత్త సుమా

వాస్తు శాస్త్రం అతి పురాతన శాస్త్రం.. ఇందులో ఇంటి నిర్మాణం గురించి మాత్రమే కాదు.. ఇంటిలో పెట్టుకునే వస్తువుల సహా అనేక విషయాలను వెల్లడిస్తుంది. ఎవరి ఇంట్లోనైనా వాస్తు దోషం ఉంటే.. కొన్ని సంకేతాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. అప్పుడు ఆ వాస్తు దోషాలను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు.

Vastu Tips: ఈ సంకేతాలు పదేపదే కనిపిస్తే ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే..  జాగ్రత్త సుమా
Vastu Tips For Home
Image Credit source: pexels

Updated on: Sep 15, 2025 | 5:38 PM

మనిషి జీవితంలో వాస్తు శాస్త్రం ప్రాముఖ్యత చాలా గొప్పదిగా వర్ణించబడింది. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటించడం వల్ల సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని పొందవచ్చు అని నమ్మకం. అయితే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను విస్మరించడం వల్ల జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతారు. ఇల్లు కేవలం నివసించడానికి ఒక ప్రదేశం మాత్రమే కాదు.. అది మనిషి జీవితానికి శక్తి, ఆనందానికి కేంద్రం. కనుక వాస్తు శాస్త్రంలో ఇంట్లో వాస్తు దోషాన్ని గుర్తించడం గురించి కొన్ని సంకేతాలను పేర్కొంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉండటం వల్ల జీవితంలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, సంబంధాలలో సమస్యలు, డబ్బుకు సంబంధించిన సమస్యలు వంటి అనేక సమస్యలు వస్తాయి. ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉండాలని కోరుకుంటే.. ముందుగా ఇంట్లో వాస్తు దోషం ఉందా లేదా అని అర్థం చేసుకోవడం ముఖ్యం. కనుక ఇంట్లో వాస్తు దోషం ఉందని తెలిపే 7 సంకేతాలను తెలుసుకుందాం.

కుటుంబంలో నిరంతర తగాదాలు, ఒత్తిడి
వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో తరచుగా చిన్న చిన్న తగాదాలు, ఒత్తిడి లేదా విభేదాలు కలుగుతుంటే అది వాస్తు దోషానికి సంకేతం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సరైన దిశ, గది స్థానం కుటుంబ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా లివింగ్ రూమ్, బెడ్ రూమ్‌లో ప్రతికూలత ఉండటం సంబంధాలలో చికాకును పెంచుతుంది

ఇవి కూడా చదవండి

తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు లోపం ఉంటే కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఆరోగ్యం పదే పదే ప్రభావితమవుతుంది. నిరంతరం తలనొప్పి, కడుపు సమస్యలు, నిద్ర లేకపోవడం లేదా అలసటగా అనిపించడం వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంద. ఈ సమస్యలు ఇంటి వాస్తు సరిగ్గా లేదని, వాస్తుని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది.

డబ్బు సంబంధిత సమస్యలు
నమ్మకాల ప్రకారం కుటుంబంలో ఎల్లప్పుడూ డబ్బు కొరత ఉన్నా, పని ఆలస్యం అవుతున్నా, వ్యాపారంలో లాభం రాకున్నా వాస్తు దోషానికి సంకేతం కావచ్చు. ఇంట్లో డబ్బు పెట్టుకునే స్థానం ప్రధాన ద్వారం దిశ, వంటగది స్థానం వంటి చిన్న అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయి.

ఇంటికి తరచుగా పగుళ్లు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులు నిరంతరం పగిలిపోవడం, కుళాయిలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సరిగ్గా పనిచేయకపోవడం, గోడలలో పగుళ్లు ఏర్పడటం కూడా వాస్తు దోషానికి సంకేతం కావచ్చు. ఈ సంఘటనలు పదే పదే జరిగితే.. ఇంటి సానుకూల శక్తి సరైన దిశలో ప్రవహించడం లేదని అర్థం.

నిద్ర లేకపోవడం, మానసిక అలసట
వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోలేకపోయినా లేదా నిద్ర పోతుంటే పదే పదే మెలకువ వస్తుంటే అది వాస్తు దోషానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా పడకగది దిశ, మంచం స్థానానికి సంబంధించినది. నిద్ర లేకపొతే ఆరోగ్యం, పని రెండింటినీ ప్రభావితం చేస్తుంది.

ఇంట్లో వాతావరణం భారంగా లేదా విచారంగా అనిపిస్తుంటే
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ భారంగా, విచారంగా లేదా ప్రతికూల శక్తి ఉన్నట్లు అనిపిస్తే, అది వాస్తు దోషాల వల్ల కావచ్చు. ఇంటి శుభ్రత, లైటింగ్, రంగు, అలంకరణ కూడా ఇంటి శక్తిని ప్రభావితం చేస్తాయి.

పునరావృతమయ్యే సమస్యలు
నమ్మకాల ప్రకారం జీవితంలో పనిలో అంతరాయం, చదువులో సమస్య లేదా ఏదైనా ప్రమాదం వంటి అవాంఛిత ఇబ్బందులు పదే పదే వస్తుంటే అది వాస్తు దోషానికి పెద్ద సంకేతం కావచ్చు. ఇది ఇంటి ప్రధాన ద్వారం, వంటగది, పడకగది, పూజ గది దిశకు సంబంధించినది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు