Vastu Tips: తులసిని పూజించడం అత్యంత శ్రేష్టం.. కానీ ‘ఈ’ రోజుల్లో తులసికి నీరు పోయడం అశుభం..

|

May 14, 2022 | 6:15 PM

ప్రాచీన కాలం నుంచి రోజూ తులసి మొక్కను పూజిస్తారు. రోజూ నీరు పోస్తారు. అయితే తులసికి కొన్ని ప్రత్యేక సందర్భాలలో నీరు పోయడం ఆశుభకరమని శాస్త్రాలు చెబుతున్నారు. ఈరోజు ఏ రోజున ఎటువంటి సందర్భాల్లో తులసికి నీరు పోయకూడదు తెలుసుకుందాం.. 

Vastu Tips: తులసిని పూజించడం అత్యంత శ్రేష్టం.. కానీ ఈ రోజుల్లో తులసికి నీరు పోయడం అశుభం..
Vastu Tips
Follow us on

Vastu Tips: తులసి మొక్క హిందువులు అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు.. పూజిస్తారు. . హిందూ గ్రంధాలలో తులసి మొక్క ప్రాముఖ్యత చెప్పబడింది. ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొనేందుకు తులసిని పూజిస్తారు. విష్ణువు కు(Vishnu) తులసి అత్యంత ప్రీతికరమైంది. పూజలో తులసి దళాన్ని సమర్పించకపోతే.. అది అసంపూర్ణమని భక్తుల నమ్మకం.  హిందూమతంలో తులసిని లక్ష్మీదేవి(Godess Lakshmi) స్వరూపంగా భావిస్తారు. తులసిని ప్రతిరోజూ పూజించే ఇంట్లో. ఎల్లప్పుడూ ఆనందం, సంపద ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి రోజూ తులసి మొక్కను పూజిస్తారు. రోజూ నీరు పోస్తారు. అయితే తులసికి కొన్ని ప్రత్యేక సందర్భాలలో నీరు పోయడం ఆశుభకరమని శాస్త్రాలు చెబుతున్నారు. ఈరోజు ఏ రోజున ఎటువంటి సందర్భాల్లో తులసికి నీరు పోయకూడదు తెలుసుకుందాం..

  1. ఆదివారం రోజున, ఏకాదశి, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో తులసికి నీరు పెట్టకూడదు. అంతే కాదు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను మొక్క నుంచి తుంచకూడదు. ఆదివారం మినహా గురువారాల్లో తులసి చెట్టుకు పచ్చి పాలు పోసి ప్రతిరోజు సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించి పూజించే వారి ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం.
  2. అలాగే ఎండిన తులసి మొక్కలను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న ఇల్లు దుష్టశక్తుల బారిన పడుతుందని నమ్మకం. పాత తులసి చెట్టు స్థానంలో కొత్త చెట్టును నాటడానికి ముందు, పాత చెట్టును చెరువులో, బావిలో లేదా పవిత్ర స్థలంలో నిమజ్జనం చేయాలి. అనంతరం దాని స్థానంలో కొత్త మొక్కలు నాటాలి.
  3. తులసి చెట్టు అన్ని విధాలా ప్రయోజనకారి. ఈశాన్యం లేదా తూర్పు వైపు నాటాలి. ఇంటి దక్షిణ భాగంలో ఎప్పుడూ తులసిని నాటకండి. ఎందుకంటే ఆలా దక్షిణ దిశలో తులసి ఉంటె.. ఇంట్లో అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం.
  4. శాస్త్రాల ప్రకారం.. తులసి ప్రతి ఆదివారం మరియు ఏకాదశిలో విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. కనుక ఏకాదశిలో తులసికి నీళ్ళు సమర్పించకూడదు. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కూడా తులసికి నీరు పెట్టకూడదు. ఈ రోజుల్లో తులసి ఆకులను తుంచవద్దు.
  5. ఇవి కూడా చదవండి
  6. తులసి ఆకులను ఎప్పుడూ గోళ్లతో తుంచకూడాదు. అయితే. తులసి ఆకులను వేలి కోనతో..తుంచవచ్చు. తులసి ఆకులను ఎప్పుడూ మొక్క పాడవకుండా తుంచాలి.
  7. స్నానం చేయకుండా తులసి చెట్టును ఎప్పుడూ తాకకూడదు.
  8. బూట్లు లేదా చెప్పుల వేసుకుని తులసి చెట్టును ఎప్పుడూ తాకవద్దు. తులసి లక్ష్మీదేవి స్వరూపం కనుక చెప్పులతో తాకవద్దు.
  9. హిందూ పురాణాల్లో తులసి చెట్టు చాలా పవిత్రమైందిగా పేర్కొన్నారు. అందుకని తులసి చెట్టు చుట్టూ ధూళి పేరుకు పోనివ్వవద్దు. జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..