Vasant Panchami: వసంత పంచమి వేళ సరస్వతి పూజకు ఈ నైవేద్యాలను సమర్పించండి.. అమ్మ కృపకు పాత్రులు కండి..

Vasant Panchami Recipes: 2022లో ఫిబ్రవరి 5న, దేశవ్యాప్తంగా వసంత పంచమి(Basanth Panchami) పండుగను జరుపుకుంటారు. ఈరోజున సరస్వతి దేవి(saraswati Devi)ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు...

Vasant Panchami: వసంత పంచమి వేళ సరస్వతి పూజకు ఈ నైవేద్యాలను సమర్పించండి.. అమ్మ కృపకు పాత్రులు కండి..
Vasantha Panchami Saraswati

Updated on: Jan 27, 2022 | 3:04 PM

Vasant Panchami Recipes: 2022లో ఫిబ్రవరి 5న, దేశవ్యాప్తంగా వసంత పంచమి(Basanth Panchami) పండుగను జరుపుకుంటారు. ఈరోజున సరస్వతి దేవి(saraswati Devi)ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, సరస్వతి దేవి మాఘ శుక్ల పంచమి నాడు జన్మించింది. పసుపు రంగు సరస్వతీ దేవికి చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. అందుకనే వసంత పంచమి రోజున ఎక్కువుగా పసుపు బట్టలు ధరిస్తారు. అంతేకాదు పూజ అనంతరం పసుపు రంగులో ఉన్న ఆహారపదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు సరస్వతి దేవికి నైవేద్యంగా పెట్టె ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం.

1) లడ్డు:బేసిన్ లడ్డు ఉత్తర భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్వీట్. ఈ లడ్డూలను శెనగపిండితో తయారు చేస్తారు. వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.లడ్డూల తయారీకి దేశవాళీ నెయ్యిలో వేయించిన శెనగపిండి, పంచదార పొడిని కలిపితే లడ్డూలు రెడీ. అమ్మవారి పూజలో బేసన్ లడ్డూలు ఎక్కువగా నైవేద్యంగా పెడతారు.

2) పెసర పప్పు హల్వా:
పెసర పప్పు హల్వా తినడానికి రుచిగా ఉంటుంది. నెయ్యితో చేసిన హల్వా అమ్మవారి నైవేద్యంలో ప్రత్యేకమైనది.

3) రవ్వ కేసరి: సరస్వతి దేవికి చాలా ఇష్టమైన నైవేద్యం రవ్వ కేసరి. ఇది చలా సులభంగా కూడా చేసుకోవచ్చు. రవ్వను నెయ్యిలో వేయించి.. ఎక్కువ నెయ్యి పోసి..నీరు కొంచెం పోసుకుని తర్వాత పంచదార డ్రై ఫ్రూట్స్ జోడిస్తే రవ్వ కేసరి రెడీ.

4) కుంకుమపువ్వు స్వీట్ రైస్: తీపి అన్నం సాంప్రదాయ భారతీయ తీపి వంటకం. ఎక్కువగా సరస్వతి దేవి పూజ కోసం తయారు చేస్టారు. కోవా, పంచదార, డ్రై ఫ్రూట్స్ , కుంకుమపువ్వుతో కూడిన మంచి సువాసనతో ఈ రైస్‌లను వండుతారు. దీనిని కేసరి అన్నం అని కూడా అంటారు.

Also Read:   ఎసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి.. అద్భుత ఫలితం మీ సొంతం..