ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాశీ విశ్వనాథుడి ఆలయంలో భక్తులకు చేరువయ్యేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఖాకీ దుస్తుల్లో కాకుండా పోలీసులు సాంప్రదాయ ధోతీ-కుర్తా.. మెడలో రుద్రాక్ష మాలతో కనిపించారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు పూజారుల్లా కన్పించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోలీసులంటే భక్తులకు భయం పోవాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రద్దీ సమయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో భక్తులను పోలీసులు తరచుగా ఇబ్బంది పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాథికారులు ఈ చర్యలు చేపట్టారు.
పోలీసు యూనిఫామ్‌లకు సంబంధించిన ప్రతికూల అవగాహనలను నివారించడానికి ఈ చర్యను తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. కొత్త వస్త్రధారణతో పాటు, క్రౌడ్ కంట్రోల్ కోసం నో టచ్ విధానం అమలు చేయబడుతుందన్నారు పోలీసు కమీషనర్ మోహిత్ అగర్వాల్. పోలీసులు రద్దీని నిర్వహించడం వల్ల భక్తులు తరచుగా అగౌరవంగా భావిస్తున్నారు. ఆలయ పూజారుల నుంచి ఇలాంటి చర్యలను భక్తులు ఎక్కువగా స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే పోలీసులు- భక్తులు స్నేహపూర్వకంగా మెలిగేందుకు ఈ చర్యను చేపట్టినట్లు తెలిపారు.
క్రౌడ్ కంట్రోల్‌లో పాల్గొన్న పోలీసుల ఇమేజ్‌ని మెరుగుపరచడానికి, సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే మార్గాలను కూడా వారు కనుగొంటున్నారని అగర్వాల్ తెలిపారు. కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరణ తర్వాత గత రెండు సంవత్సరాలతో పోలిస్తే 2018లో రద్దీ తక్కువగా ఉండగా, గర్భగుడి తలపుల నుండి పోలీసు అధికారులు బలవంతంగా వారిని బయటికి పంపించేస్తున్నారనే ఫిర్యాదులు వెలువడ్డాయి. దీనికి సంబంధించి ప్రయోగం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..