Tirumala: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి.. ఈ నెల 22న సర్వదర్శనం టోకెన్లు జారీ.. 10 రోజులు సిఫార్సు లేఖలు రద్దు

|

Dec 19, 2023 | 11:15 AM

వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాటు పూర్తిచేసింది. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు. వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తామన్నారు. ఈ పది రోజుల పాటు సిఫారస్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని ప్రకటించారు.

Tirumala: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి.. ఈ నెల 22న సర్వదర్శనం టోకెన్లు జారీ.. 10 రోజులు సిఫార్సు లేఖలు రద్దు
Tirumala
Follow us on

తిరుమల తిరుపతి క్షేత్రంలో  వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 23న వేకువజామున నుంచి భక్తులకు శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సామాన్యులు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాటు పూర్తిచేసింది. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు.

వీఐపీలు ఇవి గుర్తించుకోండి..

వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తామన్నారు. ఈ పది రోజుల పాటు సిఫారస్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని ప్రకటించారు. తిరుమల్లో వసతి సమస్య ఉందని.. వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలన్నారు. ఈ నెల 22న ఉదయం నుంచి 4.25 లక్షల దర్శన టోకెన్లను తిరుపతిలో భక్తులకు కేటాయిస్తామని తెలిపారు.

టోకెన్స్ లేని భక్తులు

10 రోజుల టోకెన్ కోటా పూర్తయ్యే వరకు భక్తులకు టోకెన్లను జారీ చేస్తామన్నారు. టోకెన్లను పొందిన భక్తులు 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు రావాలన్నారు. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తామని చెప్పారు. టోకెన్స్ లేని భక్తులు కూడా తిరుమలకు రావొచ్చని.. కానీ ఆ భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు గదులను కేటాయించలేమని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

సోమవారం ఎంత మంది దర్శించుకున్నారంటే..

రోజు రోజుకీ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  స్వామివారి దర్శనం కోసం భక్తులు 18  కంపార్ట్‌ మెంట్లలో వేచి చూస్తున్నారు. దీంతో సర్వ దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు సోమవారం ఒక్కరోజే శ్రీవారిని 61,499 మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. 24,789మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని.. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా నిన్న ఒక్క రోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చిందని టీటీడీ సిబ్బంది తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..