Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమికి చేరుకోవాలంటే..

|

Sep 10, 2021 | 8:25 AM

ఉత్తరాఖండ్‌లోని డోడితాల్‌..అదే బుజ్జి గణపయ్యకు పార్వతీమాత ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రాంతమని భక్తుల నమ్మకం. స్కాంద పురాణంలో కూడా గణేశ జన్మభూమి ప్రస్తావన ఉంది. కానీ దేవభూమిలోని డోడితాల్‌కు చేరుకోవడం...

Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ  దేవ భూమికి చేరుకోవాలంటే..
Dodital Birthplace Of Lord
Follow us on

వినాయక చవితి వచ్చేసింది. ఊరూవాడా సంతోషాలను, సంబరాలను తెచ్చింది. రకరకాల గణేశుని విగ్రహాలతో మండపాలు కళకళలాడుతున్నాయి. వినాయక పూజలతో తెలుగు రాష్ట్రాలు సందడిగా మారాయి. ఇంతకీ గజాననుని జన్మభూమి ఎక్కడ? గణేష్‌ మహరాజ్‌ జన్మించిన దేవభూమి ఎక్కడో తెలుసుకుందాం..  ఉత్తరాఖండ్‌లోని డోడితాల్‌..అదే బుజ్జి గణపయ్యకు పార్వతీమాత ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రాంతమని భక్తుల నమ్మకం. స్కాంద పురాణంలో కూడా గణేశ జన్మభూమి ప్రస్తావన ఉంది. కానీ దేవభూమిలోని డోడితాల్‌కు చేరుకోవడం చాలా కష్టం! అడుగుతీసి మరో అడుగువేయడం కూడా ఇక్కడ సాహసం.. అయినా ఎంతోమంది భక్తులు వినాయకుని జన్మభూమి చూడాలని ఆరాటపడతారు. వారికి స్థానికులు సాయం అందిస్తారు.

వినాయకుడి పుట్టక గురించి ఓ కథలు ప్రాచుర్యంలో ఉంది. శివుడు నివాసముండే హిమాలయాల్లోని కైలాశంలోనే ఆయన జన్మించారని చెబుతుంటారు. అయితే, దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లోని డోడితాల్ ప్రాంతవాసులు వినాయకుడు తమ ప్రాంతంలోనే జన్మించాడని నమ్ముతారు. శివపార్వతులు ఉత్తరాఖండ్‌లోని త్రియుగినారాయణ్ ఆలయంలో వివాహం చేసుకున్నారని స్థల పురాణాలు చెబుతున్నాయి.

మున్‌కటియా అనే ప్రాంతంలోనే రుద్ర నేత్రుడైన శివుడు వినాయకుడి తల నరికాడు. కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు ప్రధాన అవరోధాలను తొలగించాలని కోరుతూ.. మున్‌కటియాలో గల వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లోని రుద్ర ప్రయాగ జిల్లాలో ఉన్నాయి. అయితే, పార్వతీ దేవి వినాయకుడికి రూపమిచ్చిన ప్రాంతం మాత్రం ఉత్తరకాశీ జిల్లాలోని కైలాశు ప్రాంతంలో గల డోడితాల్ పేర్కొంటున్నారు. ఇది కూడా రుద్ర ప్రయాగ్ జిల్లాకు సమీపంలోనే ఉంటుంది.

సముద్ర మట్టానికి 3,024 మీటర్ల ఎత్తులో డోడితాల్ ఉంటుంది. స్వచ్ఛమైన ఈ నీటి సరస్సుకు ఒక వైపున చిన్న ఆలయంలో వినాయకుడు పార్వతీ దేవీ విగ్రహాలు ఉంటాయి. స్థానిక డోడితాల్ ప్రజలు ఇక్కడ వినాయకుడిని డోడీ రాజుగా పిలుస్తుంటారు. కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలోనే ఈ ప్రాంతం ఉండటంతో యాత్రకు వెళ్లిన భక్తులు ఇక్కడికి కూడా వెళ్తుంటారు.

డోడితాల్‌కు చేరాలంటే.. సంగంచట్టి నుంచి దాదాపు 21 కిమీలు ట్రెక్కింగ్ చేయాలి. ఇదో సాహస యాత్ర.. వినాయకుడి దర్శనం చేసుకోవాలంటే ఇంత మాత్రం చేయలేరా అంటారు భక్తులు. కేవలం వేసవిలో మాత్రమే ఇక్కడికి చేరేందుకు వీలవుతుంది. మిగిలిన రోజుల్లో ఈ ప్రాంతం మొత్తం మంచు దుప్పటితో కప్పి ఉంటుంది. ఇక్కడి చేరుకోవడం అంత ఈజీ కాదు. అందుకే చాలా మంది ఇక్కడి వెళ్లేందుకు ఓ ప్లాన్ చేసుకుని వెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..