కుమారుడితో పాటు హనుమాన్ ఆలయం.. రోజు రోజుకీ పెరుగుతున్న విగ్రహం.. తండ్రి కొడుకుల మధ్య వివాదాలు దర్శనంతోనే తొలగిపోతాయని నమ్మకం

|

Aug 20, 2024 | 7:55 AM

ఈ దేవాలయాల్లో కొన్నింటిలో బజరంగబలి విగ్రహం కూర్చుని, కొన్ని చోట్ల దణ్ణం పెడుతున్నట్లు లేదా చాలా ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నింటిలో హనుమంతుని విగ్రహం మాత్రమే భక్తులతో పూజలను అందుకుంటుంది. అయితే మన దేశంలో ఒక ఆలయంలో హనుమంతుడితో పాటు అతని కుమారుడు కలిసి పూజలు అందుకుంటున్నాడు. ఈ హనుమాన్ దేవాలయంలో భజరంగభలి తన కుమారుడు మకరధ్వజతో కలిసి ఉన్నాడు.

కుమారుడితో పాటు హనుమాన్ ఆలయం.. రోజు రోజుకీ పెరుగుతున్న విగ్రహం.. తండ్రి కొడుకుల మధ్య వివాదాలు దర్శనంతోనే తొలగిపోతాయని నమ్మకం
Hanuman Makardhwaja Temple
Follow us on

ప్రపంచవ్యాప్తంగా రామ భక్త హనుమాన్ భక్తులు అనేక మంది ఉన్నారు. ఇక దేశంలో ఆ సేతు హిమాచలం హనుమంతుడి అనేక అద్భుత ఆలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు కూడా వాటి సొంత ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ దేవాలయాల్లో కొన్నింటిలో బజరంగబలి విగ్రహం కూర్చుని, కొన్ని చోట్ల దణ్ణం పెడుతున్నట్లు లేదా చాలా ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నింటిలో హనుమంతుని విగ్రహం మాత్రమే భక్తులతో పూజలను అందుకుంటుంది. అయితే మన దేశంలో ఒక ఆలయంలో హనుమంతుడితో పాటు అతని కుమారుడు కలిసి పూజలు అందుకుంటున్నాడు. ఈ హనుమాన్ దేవాలయంలో భజరంగభలి తన కుమారుడు మకరధ్వజతో కలిసి ఉన్నాడు.

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే

గుజరాత్‌లోని ద్వారకకు నాలుగు మైళ్ల దూరంలో బెట్ ద్వారకా హనుమాన్ దండి ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర సుమారు 500 సంవత్సరాల నాటిదని చెబుతారు. హనుమంతుడు తన కుమారుడిని మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు. ఈ ప్రదేశంలో హనుమంతుడు విగ్రహంతో పాటు ఆయన కుమారుడు మకరధ్వజుడి విగ్రహం కూడా ప్రతిష్టించబడి ఉంది.

ఇవి కూడా చదవండి

హనుమంతుడికి మకరధ్వజం ఎలా వచ్చింది?

హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి. అయితే అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని పురాణాలలో పేర్కొన్నారు. పాతాళంలో మైరావణుడి దగ్గర ఉన్న శ్రీరాముడు, లక్ష్మణులను రక్షించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే బజరంగబలికి తన కొడుకు గురించి తెలుసింది. అక్కడ హనుమంతుడు తన కొడుకుతో భీకర యుద్ధం చేశాడు. తన కుమారుడిని ఓడించి రామ లక్ష్మణులను పాతాళంలోని మైరావణ చెర నుంచి విడిపించాడు. అప్పుడే తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. అతని పేరు మకరధ్వజుడు అని అతేలిసింది.

పెరుగుతున్న మకరధ్వజుడు విగ్రహం

ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహంతో పాటు మకరధ్వజ విగ్రహం కూడా ప్రతిష్టించబడి ఉంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే హనుమంతుడి విగ్రహంతో పాటు మకరధ్వజుడి విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ రెండు విగ్రహాలు చాలా సంతోషకరమైన భంగిమలో ఉన్నాయి. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే తండ్రి తనయుల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేవు. అంతేకాదు ఇక్కడ మకరధ్వజుడి విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు.. అతని తండ్రి బజరంగబలి విగ్రహం కంటే చాలా చిన్నదని స్థానికులు చెబుతారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహం బజరంగబలితో సమానంగా పెరిగింది.

దర్శనంతోనే తండ్రీ కొడుకుల మధ్య గొడవలు ముగుస్తాయి

ఈ ఆలయానికి సంబంధించి ఒక నమ్మకం కూడా ఉంది. తండ్రీకొడుకుల మధ్య ఏదో ఒక విషయంలో వివాదాలు లేదా అభిప్రాయ భేదాలు ఉంటే అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి మధ్య కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయని నమ్మకం. అంతేకాదు హనుమంతుడు, మకరధ్వజులు తండ్రీ కొడుకుల మధ్య ఆప్యాయత, సామరస్యాన్ని సృష్టిస్తుంది.

మకరధ్వజుడు ఎలా జన్మించాడంటే..?

హిందూ మత గ్రంధాల ప్రకారం హనుమంతుడు సీతాదేవి జాడను వెతుకుతూ లంకకు చేరుకుని మేఘనాదుని పట్టుకున్నప్పుడు.. హనుమంతుడిన్ని రావణుడి ఆస్థానంలో హాజరుపరిచారు. అప్పుడు రావణుడు .. హనుమాన్ తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. అప్పుడు హనుమంతుడు మండుతున్న తన తోకతో మొత్తం లంకను దహనం చేశాడు. అనంతరం హనుమంతుడు మండుతున్న తన తోకని శాంతింపజేయడానికి.. తన తోకకి ఉన్న నిప్పుని చల్లబరచడానికి సముద్రపు నీటిని ఉపయోగించాడు.

ఆ సమయంలో హనుమంతుడి శరీరం నుంచి పడిన ఓ చెమట నీటిలోకి జారింది. ఆ చెమట చుక్క వల్ల చేప గర్భవతి అయి మకరధ్వజుడు అనే కొడుకును కన్నది. మకరధ్వజుడు కూడా హనుమంతుని వలె శక్తివంతమైనవాడు. తెలివైనవాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు