Medaram Jatara 2022: మేడారం జాతరకు నిధులను మంజూరు చేసిన కేంద్రం.. గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న మంత్రి కిషన్ రెడ్డి..

|

Feb 13, 2022 | 5:16 PM

Medaram Jatara 2022: ఆసియా(Asia)లోనే అతి పెద్ద గిరిజన జాతర.. తెలంగాణ(Telangana) కుంభమేళ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం..

Medaram Jatara 2022: మేడారం జాతరకు నిధులను మంజూరు చేసిన కేంద్రం.. గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న మంత్రి కిషన్ రెడ్డి..
Medaram Jatara
Follow us on

Medaram Jatara 2022: ఆసియా(Asia)లోనే అతి పెద్ద గిరిజన జాతర.. తెలంగాణ(Telangana) కుంభమేళ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు పెట్టి.. ఘనంగా నిర్వహిస్తుంది. అయితే తాజాగా సమ్మక్క సారలమ్మ జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేయనుంది. మేడారం జాతర కోసం 2.5 కోట్లు నిధుల రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం.. గిరిజన ప్రజల విశిష్ట సంస్కృతి, వారసత్వాన్ని గౌరవిస్తుందని అన్నారు.

రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతరకు కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. భారత దేశంలోని గిరిజనులకు గుర్తింపునిచ్చేందుకు వారి వారసత్వం, సంస్కృతి పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పండగల నిర్వహణ కోసం నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. అంతేకాదు..స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజనుల అభివృద్ధిలో భాగంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. ఇప్పటికే మేడారంలో గెస్ట్ హౌస్లు, ఓపెన్ ఆడిటోరియం, పర్యాటకుల కోసం విడిది గృహాలు, త్రాగునీటి సౌకర్యం, సోలార్ లైట్లు వంటి అనేక సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. అంతేకాదు 2016-17లో తెలంగాణాలోని ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరవి,మల్లూర్ ,బోగత వంటి జలపాత ప్రాంతాలలో సుమారు రూ. 80 కోట్లతో అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి. ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం జాతరకు ఇప్పుడు కేంద్రం నిధులను రిలీజ్ చేసిందని తెలిపారు.

Also Read:

ఈ నాలుగు రాశులవారికి కోపం ఎక్కువ.. అనవసరంగా వీరితో గొడవ పడవద్దు..