Ugadi 2025: నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే.. ఉగాది సందర్భంగా కన్నడ భక్తుల పాదయాత్ర

| Edited By: Surya Kala

Mar 26, 2025 | 11:29 AM

శ్రీశైలం నల్లమల అడవిలో కన్నడ భక్తుల పాదయాత్ర కొనసాగుతోంది. ఉగాది సందర్భంగా శ్రీ శైలం ఎండను సైతం లెక్కచేయకుండా ఆదిదంపతులు కొలువైన శ్రీ క్షేత్రానికి వేలాదిగా కన్నడ భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని తమ ఆడపడుచుకుగా తలచే కన్నడ భక్తులు చీరె సారెలను సమర్పిస్తారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే అన్న చందంగా సాగుతోంది కన్నడ భక్తుల పాదయాత్ర.

Ugadi 2025: నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే.. ఉగాది సందర్భంగా కన్నడ భక్తుల పాదయాత్ర
Srisialam Ugadi
Follow us on

నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు వైభవంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీ గిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులంటున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం మరోపక్క వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపద్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుంచి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు.

పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రహదారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లుతున్నారు. భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకర్తలతో అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుంచి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్నారు. పాదయాత్రగా వస్తున్న కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో శ్రీనివాస రావు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు కన్నడ భక్తులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..