Ugadi 2022: తెలుగు నూతన (Telugu New Year) శుభకృత్ (Shubh Kruth) నామ సంవత్సరానికి స్వాగతం పలకడానికి తెలుగు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ శనివారం ప్రగతి భవన్(Pragati Bhavan)లోని జనహితలో అత్యంత ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శలు అధర్ సిన్హా, అర్వింద్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ అనిల్ కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతి భవన్‌లోని జనహితలో జరపనున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10. 30 గంటలకు ఉగాది ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉగాది వేడుకల్లో భాగంగా వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వేదపండితులకు ఉగాది పురస్కారాలు అందజేయనున్నామని.. అనంతరం కేసీఆర్ తన సందేశం రాష్ట్రప్రజలకు ఇవ్వనున్నారని తెలిపారు సోమేశ్ కుమార్.
ఉగాది రోజు సాయంత్రం 6.30 గంటలకు రవీంద్ర భారతిలో కవిసమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేయనున్నాయాన్నారు. ఉగాది ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ లోని కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.
ఈ సంవత్సరం ఉగాది (శుభకృత్ నామ సంవత్సరం..) 02-04-2022 శనివారం-పాడ్యమి- రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం అనగా బుధ నక్షత్రం. బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ శుభకృత్ నామ సంవత్సరం ఈ ఏడాది శుభములను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.
Also Read:
Chanakya Niti: జీవితంలో సక్సెస్, సుఖ, సంతోషాలు మీ సొంతం కావాలంటే.. ఈ 5 విషయాలు పాటించమంటున్న చాణక్య