హిందువుల జరుపుకునే పండగల్లో ఒక ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు అని.. లింగోద్భవం జరిగిన రోజు అని మరికొందరు శివయ్యను అత్యంత భక్తిశ్రద్దలతో కొలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలతో సహా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో శివ రాత్రి సందడి నెలకొంది. భోళాశంకరుడు దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. శివ నామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. మరోవైపు శివరాత్రి పర్వదినాన పల్నాడు జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ప్రభ ఇరిగి పడింది. బొప్పూడి గ్రామానికి చెందిన ప్రభ బండి ఇరుసు విరిగి.. 70 అడుగుల విద్యుత్ ప్రభ పడిపోయింది. ఈఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్తులు. మళ్లీ తీవ్రంగా శ్రమించి నిలబెట్టారు. కోటప్ప కొండకు తరలించారు. మరోవైపు చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో ప్రభలవద్ద మంత్రి రజని సందడి చేశారు. కొబ్బరి కాయ కొట్టి ప్రభను ప్రారంభించారు. ప్రభ ట్రాక్టర్ నడిపి ఉత్సహం నింపారు మంత్రి రజని.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..