Vastu Tips : తులసి మొక్క ఎండిపోతే అరిష్టమా? ఎందుకలా అయ్యిందో తెలుసా?

| Edited By: Ravi Kiran

Mar 04, 2023 | 8:56 AM

ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో పెంచుకున్న తులసి మొక్కను దైవసమానంగా కొలుస్తుంటారు.

Vastu Tips : తులసి మొక్క ఎండిపోతే అరిష్టమా? ఎందుకలా అయ్యిందో తెలుసా?
Tulasi
Follow us on

ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో పెంచుకున్న తులసి మొక్కను దైవసమానంగా కొలుస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం నీరు పోసి దీపం వెలిగిస్తుంటారు. ఇంట్లో తులసి మొక్కను పెంచితే నెగిటివిటి తగ్గి పాజిటివిటీ పెరుగుతుందని నమ్ముతుంటారు. అయితే మనం ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న తులసి మొక్క ఒక్కోసారి ఎండిపోతుంది. ఇలా తులసి మొక్క ఎండిపోవడానికి ..మన ఇంట్లో ఏదో కీడు జరగబోతోందనడానికి ఇది సంకేతమట. ఇంట్లో తులసి మొక్క ఎండిపోకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క మంచి, చెడు రెండింటికి సంకేతం. తులసి మంచి స్థితిలో ఉంటే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. అదే కుళ్లిపోయినట్లు, వాడిపోయినట్లు ఉంటే…చెడు సంకేతంగా భావిస్తారు.

పితృ దోషం:

ఇవి కూడా చదవండి

మీ ఇంట్లో నాటిన తులసి మొక్క ఎండిపోయిందంటే మీ ఇంట్లో పితృ దోషం కారణం కావచ్చు. పితృ దోషం ఉంటే తులసి మొక్క ఎండిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోయందంటే పితృ దోషంతో పాటు ఇతర సమస్యలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు కారణం కావచ్చు.

కుటుంబంలో సమస్యలు:

మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోయినప్పుడు, అది మీ కుటుంబానికి పెద్ద ఇబ్బంది రాబోతోందని సూచిస్తుంది. ఇంటో ఏదో కీడు జరిగే సమయంలో తులసి మొక్క ఉన్నట్లుండి ఎండిపోతుంది.

పేదరికం:

తులసి మొక్కను లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణిస్తారు. మీ ఇంట్లోలోని తులసి మొక్క ఎండిపోయినప్పుడు, మీకు ఆర్థిక సమస్యలు మొదలవుతున్నట్లు సూచిస్తుంది.

వ్యాపారంలో నష్టం:

తులసి మొక్క ఎండిపోవడం ప్రారంభించినప్పుడు, మీరు వ్యాపారంలో నష్టాన్ని చవిచూడబోతున్నారని అర్థం. అది చివరికి మీ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇంట్లో వాస్తు దోషం:

మీ ఇంట్లో వాస్తు దోష ప్రభావం ఎక్కువగా ఉన్నా. మీపై నర దృష్టి పడినా.. ఏదైనా చెడు ప్రభావం మీ పై ఉన్నా.. వెంటనే ఆ విషయం తులసి గ్రహిస్తుంది. తులసి మొక్క ఎండిపోయిందంటే మీకు హెచ్చరిక జారీ చేసినట్లు అర్థం చేసుకోవాలి.

స్నానం చేయకుండా తులసిని తాకడం :

చాలామంది స్నానం చేయకుండా తులసిని తాకుంతుంటారు. అలా తాకడం చాలా పెద్ద తప్పు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలా తాకడం వల్ల కూడా తులసి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..