Tulsi plant: తులసి మొక్కను హిందూమతంలో అత్యంత పవిత్రమైన, పూజనీయమైన మొక్కగా భావిస్తారు. పవిత్రమైన ఈ మొక్కలు ప్రజలు తమ ఇంట్లో నాటి నీరు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తులసి మొక్క కుటుంబంలోని అన్ని ఆపదలను దూరం చేస్తుందని విశ్వసిస్తారు. అలాంటి తులసి మొక్కకు సంబంధించిన 5 ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. పురాణాల ప్రకారం.. తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులసి దలం లేకుండా శ్రీహరి ఆరాధన ఎప్పటికీ సంపూర్ణం కాదు. అంతేకాదు.. తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషాల ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు పరిఢవిల్లుతాయి.
2. గ్రహణానికి ముందు తులసి ఆకులను ఆహార పదార్థాలలో వేస్తారు. దీని వల్ల గ్రహణం ప్రభావం ఆహారంపై ఉండదని విశ్వాసం. ఆహారం స్వచ్ఛంగా ఉంటుంది. తులసిలో పాదరసం లాంటి రసాయనం ఉండటమే ఇందుకు కారణం. పాదరసంపై ఎలాంటి కిరణాల ప్రభావం ఉండదు.
3. తులసిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. జలుబు, దగ్గు, దంత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. తులసి ఇతర వ్యాధుల సంక్రమణను నివారించడంలో అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
4. ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో పసుపు రంగుతో తులసి వేరును ఉంచితే ఆ ఇంటిపై పిడుగు ప్రభావం ఉండదని చెబుతారు.
5. తులసి మొక్క 24 గంటలపాటు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్. దీనిని నాటిన చోట ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. పర్యావరణం శుభ్రంగా ఉంటుంది. ప్రతి రోజూ తులసి ఆకు రసాన్ని తాగితే చర్మవ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గమనిక: మత విశ్వాసాలు, మత గ్రంధాలు, ఆయుర్వేద నిపుణుల సమాచారం మేరకు.. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దీనిని పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also read:
Dwayne Bravo: ఇంటా.. బయటా అదే స్టెప్.. ‘శ్రీవల్లి’ మాయలో పడ్డ క్రికెటర్ బ్రావో..
Budget-2022: పీపీఎఫ్ వార్షిక పెట్టుబడి పరిమితి పెంచాల్సిందేనా.. ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారు.
FIR against Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!