హిందూ మతంలో.. పవనపుత్ర హనుమంతుడిని పూజించిన వారిని కష్టాల నుండి రక్షిస్తాడని ప్రతీతి. మంగళవారం భజరంగిణికి చెందిన రోజు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని రంగాలలో ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం. అష్టసిద్ధి ప్రదాత అయిన హనుమంతుడిని పూజించడానికి అవసరమైన నియమాలు, చర్యలను వివరంగా తెలుసుకుందాం.
సింధూరం సమర్పిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి
మంగళవారం నాడు హనుమంతుని పూజలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హనుమంతుని పూజలో సింధూరం సమర్పిస్తే, జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ విధంగా.. హనుమంతుడి ఆరాధన సమయంలో కాషాయ వస్త్రాన్ని సమర్పించండి.
బజరంగి పూజలో తమలపాకులు
తమలపాకులకు హిందూమతంలో విశిష్ట స్థానం ఉంది. పూజా సమయంలో తమలపాకుని వినియోగిస్తారు. మంగళవారం నాడు హనుమంతుని పూజలో తమలపాకులు సమర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. కుటుంబంలో విభేదాలను తొలగించడానికి బజరంగిని పూజించే ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
ఆనందం. అదృష్టం కోసం
హనుమంతుడి ఆరాధనలో బజరంగిని స్తుతించే చాలీసా లేదా సుందరకాండ పఠనం చాలా పవిత్రమైనది. ఫలవంతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, బజరంగి నుండి కోరుకున్న వరం పొందడానికి.. ఆరాధనలో ఏడుసార్లు చాలీసా లేదా సుందరకాండని ఒకసారి పఠించాలి.
హనుమంతుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు
హిందూమతంలో హనుమంతుడిని గురించి ఒక నమ్మకం ఉంది. హనుమంతుడు చిరంజీవి అని కలియుగంలో కూడా ఉన్నాడని.. తన భక్తుల పిలిస్తే.. వారి సహాయం కోసం పరిగెత్తుకు వస్తాడని విశ్వాసం. సంప్రదాయం ప్రకారం బజరంగిని పూజించిన వారి కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. రామ భక్త హనుమాన్ ని ఆరాధించేవారిని కష్టాలనుంచి దూరం చేస్తాడు. అంతేకాదు.. ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యంతో జీవిస్తాడు. అతని జీవితంలో ఎలాంటి భయాందోళనలు ఉండవని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)