Telugu News Spiritual TTD will organize Sri Venkateswara Swamy Brahmotsavam in New Delhi Full Schedule
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనసేవ ఎప్పుడంటే..
న్యూఢిల్లీలో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించబోతుంది. ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో మే 21 నుంచి 29 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 20న సాయంత్రం అంకురార్పణ జరుగ నుండగా బ్రహ్మోత్సవాల ముందు మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. మే 21 ఉదయం 10.45 నుండి 11.30 గంటల మధ్య కర్కాటక లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
న్యూఢిల్లీలో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించబోతుంది. ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో మే 21 నుంచి 29 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 20న సాయంత్రం అంకురార్పణ జరుగ నుండగా బ్రహ్మోత్సవాల ముందు మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. మే 21 ఉదయం 10.45 నుండి 11.30 గంటల మధ్య కర్కాటక లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 30న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు ఆలయ పండితులు.
ఇక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు..
21న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.
22న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై మలయప్ప స్వామి కనువిందు చేస్తారు.
23న ఉదయం సింహ వాహనంపై రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు దర్శనం ఇస్తారు.
24న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి విహరిస్తారు.
25న ఉదయం మోహినీ అవతారం దర్శనం ఇవ్వండగా సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనం ఇస్తారు.
26న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనాన్ని అధిరోహిస్తారు.
27న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు కనిపిస్తారు.
28న ఉదయం రథోత్సవం జరగనుండగా రాత్రి అశ్వ వాహనంపై ఊరేగుతారు.
29న ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు అర్చకులు అదే రోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.