Tirumala: శ్రీవారి ఆలయం ముందు ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ వార్నింగ్

తిరుమల తిరుపతి క్షేత్రం ఇలా వైకుంఠం అని హిందువుల నమ్మకం. ఈ క్షేత్రంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కలియుగ దైవంగా భావించి అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. కోరిన కోర్కెలు తీర్చేదైవంగా భావించి కోనేటి రాయుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు క్యూలు కడతారు. అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రం అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ ఆలయ పవిత్రతని భ్రష్టు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Tirumala: శ్రీవారి ఆలయం ముందు ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ వార్నింగ్
Tirumala

Updated on: Jul 31, 2025 | 5:49 PM

తిరుమల శ్రీ‌వారి ఆల‌యం ముందు , మాడ వీధుల్లో ఇటీవ‌ల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు , రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయం టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొంది. అంతేకాదు ఇటువంటి పనులు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది.

భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని తెలిపింది. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించింది. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..