Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్.. భక్తులు ఇచ్చే కానుకలు తమకు చేరవన్న టీటీడీ..!

|

Sep 06, 2022 | 4:46 PM

ఆ రోజు సమర్పించే కానుకలతో టీటీడీకి సంబంధం ఉండదని, అవి టీటీడీకి చేరవని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్.. భక్తులు ఇచ్చే కానుకలు తమకు చేరవన్న టీటీడీ..!
Ttd
Follow us on

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడసేవ కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి గొడుగులు తీసుకురావడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. పలు హిందూ ధార్మిక సంస్థలు ఈ ఊరేగింపులో పాలుపంచుకుంటాయి. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా తిరుమలలో ఈ నెల 26 నుంచి నిర్వహించే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా గొడుగుల ఊరేగింపు ఉంటుంది. అయితే, గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమల చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ స్పష్టం చేసింది. ఆ రోజు సమర్పించే కానుకలతో టీటీడీకి సంబంధం ఉండదని, అవి టీటీడీకి చేరవని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇకపోతే, సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

మరోవైపు, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 7 సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 6న మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 7న అంకురార్పణం సందర్భంగా అష్టోత్త‌ర శ‌త‌క‌ల‌శాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి