Tirupati: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి కానుకలు త్వరలోనే వేలం..? పూర్తి వివరాలివే..

|

Feb 23, 2023 | 5:11 PM

బుధవారం తిరుమల శ్రీవారిని భక్తులలో 25,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారని, ఇంకా కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని

Tirupati: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి కానుకలు త్వరలోనే వేలం..? పూర్తి వివరాలివే..
Tirupati
Follow us on

కలియుగ ప్ర‌త్య‌క్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కాలంతో సంబంధం లేకుండా అనునిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఇక ఆ స్వామివారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు వివిధ రాష్టాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే తిరుమల శ్రీవారి దేవస్థానం ఒక్క రోజు ఆదాయం కూడా కోట్లల్లో ఉంటుంది. అయితే బుధవారం తిరుమల శ్రీవారిని 62,101 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక వారిలో 25,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారని, ఇంకా కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు శ్రీవారి తిరుమల ఆలయంలో.. అనుబంధ అలయాల హుండీ ద్వారా భక్తులు సమర్పించిన వాచీలు, స్మార్ట్‌ఫోన్లను మార్చి 7న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు.

అయితే  వేలం వేయనున్న వాచీలలో అనేక బ్రాండ్లు ఉన్నాయి. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలు ఉన్నాయని సమాచారం. ఆదేవిధంగా వివో , నోకియా , కార్బన్, సాంసన్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్త/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 22 లాట్లు, మొబైల్ ఫోన్లు 18 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.inను సంప్రదించాలని టీటీడీ అధికారులు కోరారు.

కాగా, గురువారం భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణంగా ఉంద‌ని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో నాలుగు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే దర్శన టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..